Home » Saindhav Movie Review : సైంధవ్ మూవీ రివ్యూ.. వెంకటేష్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..?

Saindhav Movie Review : సైంధవ్ మూవీ రివ్యూ.. వెంకటేష్ ఖాతాలో మరో హిట్ పడ్డట్టేనా..?

by Anji
Ad

 Saindhav Movie Review in Telugu : టాలీవుడ్ హీరో విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. వెంకటేష్ నుంచి ఎలాంటి సినిమా వచ్చిన మినిమం గ్యారెంటీ అనే నమ్మకంతో ప్రేక్షకులు వెంకటేష్ సినిమాను వీక్షించడానికి ఆసక్తి చూపిస్తుంటారు. అయితే వెంకటేష్ ప్రధాన పాత్రలో నటించిన మూవీ సైంధవ్. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా పై వెంకీ అభిమానులు చాలా నమ్మకంతో ఉన్నారు. ముఖ్యంగా వెంకటేష్ 75వ చిత్రం కావడంతో ఈ మూవీ ఈ సంక్రాంతికి విడుదలైన మూవీస్ లో టాప్ మూవీగా నిలుస్తుందని భావిస్తున్నారు.

saindhav-movie-review

Advertisement

 

సినిమా : సైంధవ్

నటీనటులు : విక్టరీ వెంకటేష్, రుహనీ శర్మ, శ్రద్దా శ్రీనాథ్,  బేబీ సారా, ఆర్య, ఆండ్రియా, నవాజుద్దీన్ సిద్దిఖీ తదితరులు.

నిర్మాణ సంస్థ :  నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌

నిర్మాత : వెంకట్ బోయనపల్లి.

దర్శకుడు : శైలేష్ కొలను

సంగీతం : సంతోష్ నారాయణ్

కథ మరియు వివరణ : 

వెంకటేష్ (సైంధవ్) తన భార్య (శ్రద్దా శ్రీనాథ్) మరియు కుమార్తె (స్సర పాలేకర్)తో సంతోషకరమైన జీవితాన్ని గడిపే సైంధవ్..  సైకోగా నటించారు.  తన  కుమార్తెను ఆరోగ్య సంక్షోభం నుంచి రక్షించడానికి నవాజుద్దీన్ సిద్ధిఖీ పోషించిన విరోధితో బలవంతంగా లాక్ చేస్తాడు. తన కూతురిని రక్షించాలనే లక్ష్యంలో, ఈ అరుదైన, ప్రాణాంతక వ్యాధికి ఏకైక వైద్యం కోట్ల ఖరీదు చేసే సీసా అని అతను గ్రహించాడు. అధిక ధర వెనుక కారణం నవాజుద్దీన్ సిద్ధిఖీ పాత్రకు చెందిన ఫార్మాస్యూటికల్ మాఫియా. నవాజుద్దీన్ మరియు అతని గూండాల సైన్యం నుండి పగిలిని తిరిగి పొందేందుకు వెంకటేష్ ఏం చేశాడనేదే ఈ చిత్రం యొక్క కథ.

Advertisement

వెంకీ మామ భయపెట్టేశాడు.. ఓ మై గాడ్ అనేలా చేశాడు. ఫుల్ వయలెన్స్.. ఆర్ఆర్, బీజీఎం అదిరిపోయాయ్.. నవాజుద్దీన్ సిద్దిఖి అద్భుతంగా నటించాడు. ఫస్ట్ హాఫ్ డీసెంట్‌గా ఉంది.  ప్రారంభంలో చాలా నీరసంగా, నిదానంగా కథ సాగుతుందట. ఓ ముప్పై నిమిషాల తరువాత పరిగెత్తుతుంది. యాక్షన్ సీక్వెన్స్, పర్ఫామెన్స్‌లతో ఆకట్టుకున్నారు. స్టోరీ అంతా కూడా ఎమోషనల్‌గా బాగుంది. వెంకీ ఇంటెన్స్ సీన్స్ చాలా బాగున్నాయి. హిట్ సిరీస్ తరువాత శైలేష్ కొలను మంచి సినిమాను తెరకెక్కించారని  అభిమానులు పేర్కొంటున్నారు. మొత్తానికి వెంకీ సినిమా పాజిటివ్ టాక్ దూసుకెళ్తోంది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో  సైంధవ్, హనుమాన్ రెండు మూవీస్ పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాయి.

పాజిటివ్ పాయింట్స్ : 

  • వెంకటేష్
  • నవాజుద్దీన్ నటన
  • స్సర పాలేకర్
  • క్లైమాక్స్

నెగిటివ్ పాయింట్స్ : 

  • స్టార్టింగ్ లో స్లోగా సాగడం
  • మధ్యలో బోర్ కొట్టడం
  • బీజీఎం

రేటింగ్ 3 / 5

తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!

Visitors Are Also Reading