Home » నాగ‌చైత‌న్య గురించి సాయి ప‌ల్ల‌వి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు.. వింటే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా..!

నాగ‌చైత‌న్య గురించి సాయి ప‌ల్ల‌వి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు.. వింటే ఆశ్చ‌ర్య‌పోవ‌డం ప‌క్కా..!

by Anji
Ad

టాలీవుడ్ అగ్ర‌ హీరోయిన్ల‌లో సాయిప‌ల్ల‌వి ఒక‌రు. ఆమె ఎలాంటి గ్లామ‌ర్‌షో చేయ‌క‌పోయినా సాయిప‌ల్ల‌వికి అవ‌కాశాలు వెతుక్కుంటూ వ‌స్తున్నాయి. ఆమెకున్న టాలెంట్ గురించి ఇక ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. ఇటీవ‌లే ఆమె న‌టించిన విరాట‌ప‌ర్వం సినిమా విడుద‌లైన విష‌యం తెలిసిందే. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద అంత‌గా క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించ‌క‌పోయిన‌ప్ప‌టికీ సాయిప‌ల్ల‌వి మాత్రం అద్భుతంగా న‌టించింద‌నే చెప్ప‌వ‌చ్చు.


ఇక సాయిప‌ల్ల‌వి త‌న వ్య‌క్తిత్వం ప‌రంగా అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఆమెకు గ‌తంలో ప‌లు కంపెనీలు భారీ పారితోషికం ఇస్తామని.. యాడ్స్ చేయాల‌ని ఆమెకు ప‌లు ఆఫ‌ర్ల‌ను ఇచ్చాయి.అయితే ఆమె వాటిని తిర‌స్క‌రించింది. త‌న‌కు స‌హ‌జ‌సిద్ధ‌మైన అంద‌మే ముఖ్యం అని, బ్యూటీ మాత్ర‌మే కాదు.. నేను ఎలాంటి ప్రొడ‌క్ట్స్‌ను కూడా ప్ర‌మోట్ చేయ‌లేను అని నిర్మొహ‌మాటంగా చెప్పింది. ఇటీవ‌లే మరొక కంపెనీ కూడా ఆమెకు భారీ మొత్తంలో ఇస్తామ‌ని చెప్పింది. అయిన‌ప్ప‌టికీ ఆమె సున్నితంగా ఆఫ‌ర్‌ను తిరస్క‌రించి త‌న వ్య‌క్తిత్వం ఎలాంటిదో మ‌రొక మారు చాటుకున్న‌ది.

Advertisement

Advertisement


చాలా మంది సాయిప‌ల్ల‌వి డ్యాన్స్ మాత్ర‌మే కాకుండా ఆమె క్యారెక్ట‌ర్ అంటే కూడా చాలా మంది ఇష్ట‌ప‌డుతుంటారు. అందుకు త‌గ్గ‌ట్టుగా ఆమెకు ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఇటీవ‌ల ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొంది. అందులో కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్లడించింది. టాలీవుడ్ సినీ హీరోల్లో త‌న‌కు నాగ‌చైత‌న్య‌, రానా మంచి స్నేహితులు అని చెప్పింది. రానా త‌న‌కు విరాట‌ప‌ర్వం సినిమా షూటింగ్ స‌మ‌యంలో చాలా హాయం చేశార‌ని చెప్పుకొచ్చింది. అదేవిధంగా నాగ‌చైత‌న్య అంటే నాకు చాలా ఇష్టం అని, ఆయ‌న త‌న‌ను చాలా కేరింగ్‌గా చూసుకుంటార‌ని చెప్పింది. నాగ‌చైత‌న్య‌తో ఉంటే ఆయ‌న‌ది, త‌న‌ది ఒకే కుటుంబం అనే ఫీలింగ్ క‌లుగుతుంద‌ని సాయిప‌ల్ల‌వి తెలిపింది. ఇక సాయిప‌ల్ల‌వి చేసిన ఈ కామెంట్స్ సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.

Also Read : 

రేసుగుర్రం విల‌న్ హీరోయిన్ న‌గ్మాల మ‌ధ్య అంత క‌థ న‌డిచిందా..? అప్ప‌ట్లో హాట్ టాపిక్..!

ఆషాడమాసంలో గోరింటాకు పెట్టుకోవ‌డం వెనుక ఉన్న ర‌హ‌స్యం ఏమిటో తెలుసా..?

 

Visitors Are Also Reading