Home » రేసుగుర్రం విల‌న్ హీరోయిన్ న‌గ్మాల మ‌ధ్య అంత క‌థ న‌డిచిందా..? అప్ప‌ట్లో హాట్ టాపిక్..!

రేసుగుర్రం విల‌న్ హీరోయిన్ న‌గ్మాల మ‌ధ్య అంత క‌థ న‌డిచిందా..? అప్ప‌ట్లో హాట్ టాపిక్..!

by AJAY
Ad

టాలీవుడ్ లో ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్స్ లో న‌గ్మా కూడా ఒక‌రు. పెద్దింటి అల్లుడు సినిమాతో న‌గ్మా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోలు అంద‌రి ప‌క్క‌న న‌టించి న‌గ్మా స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. ముఖ్యంగా న‌గ్మా కొంటె చూపుల‌కు యూత్ లో ఎక్క‌వ మంది అభిమానులు ఉండేవారు. ఈ ముద్దుగుమ్మ డేట్స్ కోసం స్టార్ హీరోలు సైతం వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితులు ఉండేవి.

Advertisement

ఇక అప్ప‌ట్లో న‌గ్మాకు ప‌లువురు సెల‌బ్రెటీల‌తో ఎఫైర్స్ ఉన్నాయంటూ కూడా వార్త‌లు వినిపించేవి. అప్ప‌టి టీమ్ ఇండియా క్రికెట‌ర్ తో న‌గ్మా రిలేష‌న్ షిప్ లో కూడా ఉండేవారు. వీరిద్ద‌రూ చెట్టాప‌ట్టాలేసుకుని తిరిగి వార్త‌ల్లో హాట్ టాపిక్ గా నిలిచారు. ఆ త‌రవాత బోజ్ పురి న‌టుడు ర‌వికిష‌న్ తో కూడా న‌గ్మా ప్రేమ‌లో మునిగి తేలింది.

Advertisement

ర‌వికిషన్ అంటే టాలీవుడ్ ప్రేక్ష‌కులు గుర్తుప‌ట్ట‌రేమో గాని రేసుగుర్రం సినిమా విల‌న్ అంటే మాత్రం గుర్తుప‌ట్ట‌ని వారు ఉండ‌రు. రేసుగుర్రం సినిమాలో మ‌ద్దాలి శివారెడ్డి అనే పాత్ర‌లో న‌టించి ర‌వికిష‌న్ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్నాడు. ఆ త‌ర‌వాత చాలా సినిమాల్లో క‌నిపించాడు. నిజానికి రవికిష‌న్ బోజ్ పురి లో సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు. న‌గ్మా 2005 స‌మ‌యంలో బోజ్ పురిలో కూడా సినిమాలు చేసింది ఆ స‌మ‌యంలో ర‌వికిష‌న్ తో ప‌రిచ‌యం ప్రేమ మొద‌ల‌య్యాయి.

అయితే అప్ప‌టికే ర‌వికిష‌న్ కు పెళ్లి కూడా జ‌రిగిపోయింది. అయిన‌ప్ప‌టికీ న‌గ్మాతో రిలేష‌న్ ను మాత్రం కొన‌సాగించాడు. న‌గ్మా అంటే త‌నకు ప్రాణ‌మని ర‌వికిష‌న్ త‌న భార్య‌కు కూడా చెప్పేవాడ‌ట‌. న‌గ్మా ర‌వికిష‌న్ ల ప్రేమ గురించి బోజ్ పురి ప్రేక్ష‌కుల్లో తెలియ‌ని వారుండ‌రు. ఇక చివ‌రికి ఏమైందో కానీ న‌గ్మా బోజ్ పురి ఇండ‌స్ట్రీ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి రాజ‌కీయాల్లో చేరింది. ఆ త‌ర‌వాత వీరిద్ద‌రి గురింలి ఎలాంటి వార్త‌లు రాలేదు.

Visitors Are Also Reading