Home » పెదరాయుడు సినిమా హిట్ కి సాయి కుమార్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

పెదరాయుడు సినిమా హిట్ కి సాయి కుమార్ కి ఉన్న సంబంధం ఏంటో తెలుసా ?

by Bunty
Ad

మోహన్ బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి డైరెక్షన్ లో తెరకెక్కిన ‘పెద రాయుడు’ చిత్రం ఎంతటి ఘన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్” బ్యానర్ పై హీరో మోహన్ బాబే ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఆయన ద్వీపాత్రాభినయం కనబరిచారు. పెద రాయుడుగా అలాగే అతని పెద్ద తమ్ముడు రాజా పాత్రల్లో నటించి మెప్పించారు.

Advertisement

మోహన్ బాబు సరసన భానుప్రియ, సౌందర్యలు, హీరోయిన్లుగా నటించారు. కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ చిత్రంలో అతిథి పాత్రను పోషించడం మరో విశేషం. 1995 వ సంవత్సరం జూన్ 15న ఈ చిత్రం విడుదలైంది. నేటితో ఈ చిత్రం విడుదల 27 ఏళ్లు పూర్తి కావస్తోంది. అయితే, పెద రాయుడు సినిమా హిట్ కి సాయి కుమార్ కి ఓ సంబంధం ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక రజినీకాంత్ లాంటి స్టార్ తెలుగులో నేరుగా చేసిన సినిమాల్లో కూడా సాయికుమార్ తన గాత్రం ఇచ్చారు.

Advertisement

అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది పెద రాయుడు. ఈ చిత్రం చాలా పెద్ద హిట్ అయింది. చరిత్రలో నిలిచిపోయే రికార్డులను బద్దలు కొట్టింది. అయితే ఈ సినిమాలో పాపారాయుడు పాత్రలో రజినీకాంత్ నటించి ఆ సినిమా వేల్యూ పెంచడమే కాదు. రజినీకాంత్ గొంతులో సాయికుమార్ గాంబిర్యం కూడా ఆ పాత్రకు ఆయువు పట్టు. పెద రాయుడు సినిమా ఇప్పటికి టీవీలో వచ్చిన రజనీకాంత్ గారి కోసం, ఆయన చెప్పే డైలాగ్స్ కోసం చూసేవారు చాలామంది ఉంటారు. అంతలా సాయికుమార్ ఎందరో బయట నటులను మన తెలుగు వారికి చేరువ చేశాడు.

READ ALSO : లగ్జరీ హెలికాప్టర్ కొన్న కరీంనగర్ వాసి.. యాదాద్రిలో ప్రత్యేక పూజలు..రేటు ఎంతో తెలుసా ?

Visitors Are Also Reading