టాలీపుడ్ సూపర్ స్టార్ మహేష్‌బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట ఆటకు సిద్ధమైంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి కావడంతో మహేష్ బాబు మరొక సినిమాకు సిద్ధమవుతున్నాడు. మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్లో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసినదే. అయితే దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మహేష్ బాబుతో సినిమా చేయనున్నట్టు ఇదివరకే ప్రకటించారు. ఈ తరుణంలో ఇప్పటికే జక్కన్న ఈ సినిమా కోసం కసరత్తులు ప్రారంభించినట్టు తెలుస్తోంది.
తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్‌ను తీసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. మరొక వైపు కియారా అద్వాని పేరు కూడా వినిపించింది. తాజాగా మరొక అమ్మాయి పేరు తెరపైకి వచ్చింది. ఆమె మరెవ్వరో కాదు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ను తీసుకోవాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలో ఎంత వరకు వాస్తవముందో తెలియదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్త హల్ చల్ సృష్టిస్తోంది.
Advertisement
Advertisement
ఇక సారా టెండూల్కర్ విషయానికొస్తే తన తల్లి లాగే మెడిసిన్ పూర్తి చేసారు. లండన్ లో మెడిసిన్ చేసిన సారాకు మోడలింగ్ అంటే ఎంతో ఆసక్తి. ర్యాంపు మీద మెరిసి అందరినీ దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా సినిమాలు అంటే కూడా ఆమెకు ఇష్టమేనట. చిన్నప్పటి నుంచి సినిమాలు బాగా చూసేదని సమాచారం. మరొక వైపు నటనపై శిక్షణ కూడా తీసుకుందట. ఇప్పటికే మోడలింగ్ రంగంలో పట్టు ఉన్న సారా పలు బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. సారా అందానికి ఫిదా అయినటువంటి బాలీవుడ్ దర్శక, నిర్మాతలు తనకు సినిమా అవకాశాలు కల్పించడంతో పాటు ముందు తన చదువును పూర్తి చేయాలని సినిమా అవకాశాలను ఈమె పక్కన పెట్టేసారు.
ఇక సినిమాల్లోకి అడుగుపెట్టాలన్న సారా నిర్ణయానికి తండ్రి సచిన్, తల్లి అంజలి మద్దతు ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తన చదువు పూర్తి కావడంతో సారా టెండూల్కర్ వెండితెర ఎంట్రీకి సిద్ధం అయిందని కూడా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలోనే మహేష్‌బాబు-రాజమౌళి కాంబోలో రాబోయే సినిమా కోసం సారా టెండూల్కర్‌ను తీసుకోవాలనే ఆలోచనలో జక్కన్న ఉన్నట్టు సమాచారం. సారా టాలీవుడ్ దర్శకుడితో ఎంట్రీ ఇస్తుందా.. లేక బాలీవుడ్ దర్శకుడి కోసం ఎదురు చూస్తుందా తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే.
Also Read :
నోటి దుర్వాసన వస్తుందా.. అయితే ఇంట్లోనే ఈ వైద్యంతో చెక్ పెట్టండి..!!
అరటిపండు తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో మీకు తెలుసా..?