మారుతున్న కాలానికి అనుగుణంగా మన జీవన విధానంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే డైట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. ముఖ్యంగా మన రోజువారి డైట్ లో అరటిపండు ఉండేవిధంగా జాగ్రత్త పడాలని వైద్యులు సూచిస్తున్నారు. అరటిపండు తినడం వల్ల ఎలాంటి లాభాలు పొందవచ్చనేది ఇప్పుడు మీరు కూడా తెలుసుకోండి.
ముఖ్యంగా షుగర్ వ్యాధిగ్రస్తులు అరటిపండు తినొచ్చా లేదా అని చాలా మంది సందేహపడుతుంటారు. అరటిపండు తినడం వల్ల షుగర్ వ్యాధి గ్రస్తులకు మేలు జరుగుతుందని పరిశోధనలో వెల్లడి అయింది. మధుమేహ సమస్య ఉన్న వారు కేవలం కాస్త పండినవి తీసుకోవాలని, ఎక్కువగా పండినవి తీసుకోకూడదు అని నిపుణులు సూచిస్తున్నారు. అరటి పండులో పీచు పదార్థం అధికంగా ఉండడంతో కొవ్వు శాతం తక్కువగా ఉంటుంది.
ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి అరటి అమితమైన మేలు చేస్తుంది. ముఖ్యంగా గుండె జబ్బు, క్యాన్సర్ జీర్ణకోశ సంబంధిత వంటి సమస్యలను రాకుండా చేయడంలో అద్భుతంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా జీర్ణాశయానికి మేలు చేసే బాక్టీరియా ఇందులో పుష్కలంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణ సమస్యలు వెంటనే మటుమాయమవుతాయి. పలు రకాల సమస్యల నుంచి ముందు మనల్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read :
Today rasi phalalu in Telugu : నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు జాగ్రత్తగా ఉండాలి
హైదరాబాద్ జూలో రాయల్ బెంగాల్ టైగర్ కు స్టార్ హీరో పేరు..!