రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధంలో నేటికి ఏడవ రోజు. ఈ యుద్దాన్ని నిలిపివేయాలని ప్రపంచ దేశాలన్నీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను కోరుతున్నా, ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గడానికి ఆయన సిద్ధంగా లేరు. ఈరోజు రష్యా సైన్యం ఉక్రెయిన్‌లోని సైనిక స్థావరంపై దాడి చేయడం 70 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. కైవ్ దాడి సమయంలో రష్యా వాక్యూమ్ బాంబ్ అని కూడా పిలువబడే థర్మోబారిక్ ఆయుధాన్ని ఉపయోగించిందని అమెరికాలోని రష్యా రాయబారి ఒక్సానా మార్కోవా మీడియాలో ఓ ప్రకటన చేసారు.
Also Red : చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి.. అందుకోసమేనా..?
Advertisement
Advertisement
దీంతో ప్రపంచ వ్యాప్తంగా అనేక మానవ హక్కుల సంఘాలు, అమ్నేస్టి ఇంటర్నేషనల్ రష్యా వాక్యూమ్ బాంబులు, క్లస్టర్ బాంబులను ఉక్రెయిన్‌పై ఉపయోగించిందని ఆరోపించాయి. రష్యా నిజంగా వాక్యూమ్ బాంబులను ఉపయోగించిందా..? ఈ రోజు వాక్యూమ్ బాంబులను ఉపయోగించినట్టు చట్టసభ సభ్యులతో జరిగిన సమావేశంలో అమెరికాలోని రష్యా రాయబారి ఒక్సానా మార్కోవా చెప్పారు. ఉక్రెయిన్‌పై రష్యా విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నిస్తోంది.
అయితే ఉక్రెయిన్ వాదనలు ఇంకా ధృవీకరించలేదు. ఇది నిజమైతే బహుశా అది యుద్ధ నేరమేనని వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ ప్సాకి చెప్పినట్టు వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది.
Also Read : ఉక్రెయిన్‌లో మరో భారతీయుడు మృతి