Home » పారిపోయిన యూట్యూబ‌ర్‌.. అత‌ని ఆచూకి చెప్పిన వారికి రూ.25వేల రివార్డ్‌..!

పారిపోయిన యూట్యూబ‌ర్‌.. అత‌ని ఆచూకి చెప్పిన వారికి రూ.25వేల రివార్డ్‌..!

by Anji
Ad

విమానంలో సిగ‌రేట్ తాగుతూ.. రోడ్డ‌పై మ‌ద్యం సేవిస్తూ ఇటీవ‌ల తెగ హ‌ల్‌చ‌ల్ చేసిన ఓ యూ ట్యూబ‌ర్ బాబీ క‌టారియా ప‌రారీలో ఉన్నాడు. అత‌డిని ప‌ట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. అత‌న్ని ఆచూకి తెలిపిన వారికి రూ.25000 న‌గ‌దును బ‌హుమ‌తిగా ఇవ్వ‌నున్న‌ట్టు పోలీసులు ప్ర‌క‌టించారు. డెహ్రాడూన్‌లో రోడ్డు మ‌ధ్య‌లోనే మ‌ద్యాన్ని సేవిస్తూ ట్రాఫిక్ జూమ్‌కి కార‌ణ‌మైన కేసులో ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు. ఇందులో భాగంగానే బాబీ క‌టారియాను అరెస్ట్ చేయాల‌ని ముమ్మ‌రంగా గాలిస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చ‌ద‌వండి :  కొర‌టాల స్టార్ డైరెక్ట‌ర్ అవ్వ‌డానికి సింహా సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఆ మోసం త‌ర‌వాతే..?

Advertisement

Advertisement

నిందితుడు బాబీ క‌టారియా పై నాన్ బెయిలెబుల్ వారెంట్ జారీ అయిన‌ట్లు పోలీస్ ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. ఇక క‌టారియాను అరెస్ట్ చేసేందుకు హ‌ర్యానాలోని గురుగ్రామ్ లోని అత‌ని నివాసంలో సోదాలు జ‌రుపుతున్నారుఉత్త‌రాఖండ్ పోలీసులు. కానీ అతడు ఎవ్వ‌రికీ క‌నిపించ‌కుండా పారిపోయాడు. దీంతో అత‌న్ని ప‌ట్టుకునేందుకు రూ.25,000 రికార్డ్ ప్ర‌క‌టించిన‌ట్టు డెహ్రాడూన్ ఎస్‌ఎస్పీ దిలీప్ సింగ్ కున్వార్ తెలిపారు.

ఇక బాబీ క‌టారియా ముస్సోరి కిమ్డీ మార్గ్ మ‌ధ్య‌లో టేబుల్ వేసుకుని కూర్చుని ట్రాఫిక్‌కి తీవ్ర అంత‌రాయం క‌లిగించాడు. అంతేకాకుండా ప‌బ్లిక్ ప్లేస్‌లో మ‌ద్యం సేవించాడు. మ‌ద్యం సేవించి మ‌త్తులోనే త‌న వాహ‌నాన్ని న‌డిపి నానా ర‌చ్చ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్ర‌స్తుతం ఆ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది. దీంతో పోలీసులు అత‌న్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి త‌రలించాల‌ని అత‌ని కోసం గాలిస్తున్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :  నెట్టింట రౌడీ ఫ్యాన్స్ వ‌ర్స‌స్ జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ….ఆంటీ అంటూ దారుణ‌మైన ట్రోలింగ్..!

Visitors Are Also Reading