Home » కొర‌టాల స్టార్ డైరెక్ట‌ర్ అవ్వ‌డానికి సింహా సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఆ మోసం త‌ర‌వాతే..?

కొర‌టాల స్టార్ డైరెక్ట‌ర్ అవ్వ‌డానికి సింహా సినిమాకు ఉన్న లింక్ ఏంటో తెలుసా..? ఆ మోసం త‌ర‌వాతే..?

by AJAY
Ad

సినిమా ఇండ‌స్ట్రీలో ద‌ర్శ‌కులు సినిమాల‌ను తెర‌కెక్కిస్తుంటారు. కొన్ని సినిమాల‌కు క‌థ‌ల‌ను ద‌ర్శ‌కులే రాస్తే కొన్ని సినిమాల‌కు మాత్రం ఇత‌ర ర‌చ‌యిత‌లు క‌థ‌ల‌ను అందిస్తుంటారు. అలా క‌థ‌ను అందించిన‌ప్పుడు ర‌చ‌యిత‌ల పేర్ల‌ను వేయ‌క‌పోతే వారికి అన్యాయం జ‌రిగిన‌ట్టే. అలా చాలా మంది ర‌చ‌యిత‌లు త‌మ పేరు టైటిల్స్ లో వేయ‌లేద‌ని ఇంట‌ర్వ్యూల‌లో చెబుతూ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

Advertisement

ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం టాలీవుడ్ లో స్టార్ డైరెక్ట‌ర్ గా రాణిస్తున్న కొర‌టాల శివ కూడా ఒక‌ప్పుడు ర‌చ‌యిత‌గా ప‌లు సినిమాల‌కు క‌థ‌ల‌ను అందించారు. కొర‌టాల సినిమాల‌పై ఉన్న ఆస‌క్తితో త‌న మేన‌మామ పోసాని కృష్ణ ముర‌ళి వ‌ద్ద అసిస్టెంట్ గా ప‌నిచేశారు. అంతే కాకుండా ప‌లు చిత్రాల‌కు స్క్రీన్ రైటింగ్ అసిస్టెంట్ గా కూడా కొర‌టాల ప‌నిచేశారు. మున్నా, బృందావ‌నం, ఒక్క‌డున్నాడు స‌హా ప‌లు చిత్రాల‌కు ప‌నిచేశారు.

Advertisement

ఇక 2013లో కొర‌టాల శివ మిర్చి సినిమాతో ద‌ర్శ‌కుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయ్యింది. ఆ త‌ర‌వాత కొర‌టాల ఇండ‌స్ట్రీలో వ‌రుస అవ‌కాశాల‌ను అందుకున్నాడు. అదే విధంగా జ‌న‌తా గ్యారేజ్, శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను లాంటి సూప‌ర్ హిట్ చిత్రాల‌ను తెర‌కెక్కించారు. ఇక రీసెంట్ గా ఆచార్య సినిమాతో కొరటాల శివ మొద‌టి సారి ఫ్లాప్ ను త‌న ఖాతాలో వేసుకున్నాడు.

ఇదిలా ఉండ‌గా కొర‌టాల తాను సింహా సినిమాకు ర‌చ‌యిత‌గా ప‌నిచేశాన‌ని చెప్పారు. కానీ త‌న పేరును టైటిల్స్ లో వేయ‌లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. కానీ తాను ద‌ర్శ‌కుడిగా అవ్వ‌డానికి అది కూడా ఒక కార‌ణం అయ్యింద‌ని అన్నారు. అదేవిధంగా త‌న మామ పోసాని దగ్గ‌ర అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌నిచేశాన‌ని ఆయ‌న ప‌నిరాక్ష‌సుడు అని చెప్పారు.

Visitors Are Also Reading