టాలీవుడ్ సీనియర్ నటుడు జగపతి బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. హీరోగా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న తరువాత కొన్ని సినిమాల్లో విలన్‌గా నటించి అందరి మన్ననలు పొందారు. వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ విలక్షణ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. జగపతిబాబు నటిస్తున్న తాజా మూవీ రుద్రంగి. ఎమ్మెల్యే, కవి, గాయకుడు, రాజకీయ వేత్త రసమయి బాలకిషన్, రసమయి ఫిలిమ్స్ బ్యానర్‌తో ఈ సినిమా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
Advertisement
ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఇందులో నటుడు జగపతి బాబు భీకరంగా, జాలి, దయలేని భీమ్‌రావ్ దొరగా పరిచయం చేశారు. ఉత్కంఠ పెంచేవిధంగా ఉండే నేపథ్య సంగీతంతో తీసుకెళ్లుతూ రుద్రంగి నాది, రుద్రంగి బిలాంగ్స్ టూ మీ అని జగపతి బాబు డైలాగ్‌తో ముగించే లోపు ప్రేక్షకుడి రోమాలు నిక్కబొడుసుకుంటాయి. కంటెంట్‌తో వెళ్లే కథతో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాలనుకునే నిర్మాతలతో రుద్రంగి చిత్రాన్ని పేరుపొందిన నటులు జగపతిబాబు, ఆశిష్ గాంధీ, గానవి లక్ష్మణ్, విమలరామన్, మమతా మోహందాస్, కాలకేయ ప్రభాకర్ సదానందం వంటి నటీనటులతో తెరకెక్కిస్తున్నారు.
Advertisement
Also Read : వాస్తవాన్ని ఒప్పుకున్న బండ్ల గణేష్..!
బాహుబలి, ఆర్ఆర్ఆర్ చిత్రాలకు రైటర్ గా పని చేసిన అజయ్ సామ్రాట్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సంతోష్ శనమోని సినిమాటోగ్రఫీ, బొంతల నాగేశ్వర్ రెడ్డి ఎడిటింగ్, నాఫల్ రాజా ఐఏఎస్ సంగీతం అందిస్తున్నారు. టైటిల్ కి ఫస్ట్ లుక్‌కి అనూహ్యమైన స్పందన రావడంతో అదే జోష్‌లో ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేసేందుకు నిర్మాతలు సిద్ధమవుతున్నారు.
Also Read : పొన్నియిన్ సెల్వన్ లో నటించిన ఈ చిన్నారి ఎవరో తెలుసా ?