Home » పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. 14 మంది ఎమ్మెల్యేలపై వేటు..!

పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. 14 మంది ఎమ్మెల్యేలపై వేటు..!

by Sravan Sunku
Published: Last Updated on
Ad

పంజాబ్‌ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌, విపక్ష అకాలీదళ్‌ ఎమ్మెల్యేల మధ్య తీవ్ర ఘ‌ర్ష‌ణ చోటు చేసుకుంది. కేంద్రం పంజాబ్ స‌రిహ‌ద్దులో బీఎస్ఎఫ్ పెంచ‌డాన్ని వ్య‌తిరేకిస్తూ పంజాబ్ ప్ర‌త్యేక అసెంబ్లీ స‌మావేశం తీర్మాణం చేసింది. దీనిపై చోటు చేసుకున్న వాగ్వాదం కాస్త ఘ‌ర్ష‌ణ‌కు దారి తీసింది. పీసీసీ చీఫ్ సిద్ధూ, అకాళిద‌ల్ ఎమ్మెల్యే బిక్ర‌మ్‌సింగ్ మంజిత కొట్టుకునేంత ప‌ని చేశారు. అయిన‌ప్ప‌టికీ అధికార‌, విప‌క్ష స‌భ్యుల మ‌ధ్య తోపులాట చోటు చేసుకున్న‌ది.

Advertisement

Advertisement

పంజాబ్ ముఖ్య‌మంత్రి చ‌ర‌ణ్‌జిత్‌సింగ్ ప్ర‌సంగం చేస్తుండ‌గానే అకాళిద‌ల్ ఎమ్మెల్యేలు అడ్డుకునేందుకు దూసుకెళ్లారు. దేశ‌ద్రోహులు, డ్ర‌గ్స్ వ్యాపారం చేస్తారంటూ అకాళీద‌ల్ ఎమ్మెల్యేల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు సీఎం. ఈ త‌రుణంలోనే అక్క‌డికి దూసుకొచ్చిన సిద్దూ ఎమ్మెల్యే బిక్రంసింగ్ మంజిత‌ను దొంగ అంటూ దూషించారు. వీరిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకున్న‌ది. ప‌ర‌స్ప‌ర దూష‌ణ‌లు పార్టీల మ‌ధ్య చిచ్చు పెట్టేందుకు దారితీసేలా మారాయి. ఇందుకు నిర‌స‌న‌గా స్పీక‌ర్ కార్యాల‌యం ముందు అకాళిద‌ల్ ఎమ్మెల్యేలు ధ‌ర్నా చేసేందుకు ప్ర‌య‌త్నించారు. త‌ర్వాత‌ స్పీక‌ర్ 14 మంది అకాలీద‌ల్ ఎమ్మెల్యేల‌ను స‌స్పెండ్ చేశారు.

ఇవి కూడా చదవండి: కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలి : మంత్రి హరీష్‌రావు

Visitors Are Also Reading