Home » కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలి : మంత్రి హరీష్‌రావు

కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ తీసుకురావాలి : మంత్రి హరీష్‌రావు

by Sravan Sunku
Ad

తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే విభజన చట్టంలోని హామీలను నెరవేర్చాలని హరీష్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కిషన్‌రెడ్డి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని తీసుకురావాలన్నారు. పచ్చి అబద్ధాలతో కిషన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారన్నారు. బీబీనగర్‌ ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వడంతోపాటు బిల్డింగ్‌ కూడా ఇచ్చాం. ఎయిమ్స్‌కు స్థలం ఇవ్వలేదని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.

Advertisement

Advertisement

ఎయిమ్స్‌ అనేది విభజన చట్టం ద్వారా తెలంగాణకు వచ్చిన హక్కు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కేవ‌లం ఖ‌రీఫ్ సీజ‌న్‌ను సంబంధించిన వ‌డ్ల‌ను మాత్ర‌మే కొంటుంద‌ని చెప్పారు. బీజేపీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందన్నారు. బాధ్యతయుతమైన పదవిలో ఉండి కూడ ఇలా మాట్లడటం సరికాదని కిషన్‌ రెడ్డిని ఉద్దేశించి మంత్రి హరీష్ రావు అన్నారు. కేంద్రంలో బీజేపీ వడ్లు కొనద్దని లేఖలు రాస్తుంటే రాష్ట్రంలో ఉన్న బీజేపీ నాయకులు మాత్రం వడ్లు కొనాలంటున్నారన్నారు. కేంద్రానికి, రాష్ట్ర బీజేపీకి సమన్వయం లేదన్నారు. తెలంగాణకు బీజేపీ ఒక్క మెడికల్‌ కాలేజీ ఇవ్వలేదని మంత్రి హరీష్‌రావు అన్నారు.

Visitors Are Also Reading