Home » ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిభిరం…బ్ల‌డ్ డొనేట్ చేసిన స‌జ్జ‌నార్..!

ఆర్టీసీ ఆధ్వ‌ర్యంలో ర‌క్త‌దాన శిభిరం…బ్ల‌డ్ డొనేట్ చేసిన స‌జ్జ‌నార్..!

by AJAY

టీఎస్ ఆర్టీసీ, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ బస్ స్టేషన్ లో స్వచ్చంద రక్త దాన శిభిరాన్ని నిర్వ‌హించారు. ఈ శిభిరానికి హైదరాబాద్ కలెక్టర్ శర్మన్..ఆర్టీసీ ఎండి సజ్జనార్ లు ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. అంతే కాకుండా ఈ సంధ‌ర్బంగా ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌న్నార్ ర‌క్త‌ధానం చేశారు. అనంత‌రం సజ్జనార్ మాట్లాడుతూ….టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం, ఇండియన్ రెడ్ క్రాస్ హైదరాబాద్ 97 డిపోలు 67 సొసైటీ ల‌లో బ్లడ్ డొనేష‌న్ కార్య‌క్ర‌మం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గత సంవత్సర కాలంగా బ్లడ్ కొరత ఏర్పడుతుందన్నారు.

RTC MD SAJJANAR

RTC MD SAJJANAR

తలేసిమియా వ్యాధిగ్రస్తులు, క్యాన్సర్ పేషంట్స్, యాక్సిడెంట్ కార‌ణంగా గాయ‌ప‌డ్డ వారికి బ్లడ్ ఎంతో అవసరని అన్నారు. నర్సంపేట డ్రైవర్ శ్రీనివాస్ ఇప్పటి వరకు 80 సార్లు బ్లడ్ డోనేట్ చేశారని కొనియాడారు. ఆయన చేత నర్సంపేట లో బ్లడ్ డోనేట్ కాంప్ ప్రారంభమైందని స‌జ్జ‌న్నార్ వెల్ల‌డించారు. ఆర్టీసి సిబ్బంది, కుటుంబ సభ్యులు బ్లడ్ డోనేట్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా బ్లడ్ డోనేట్ చేయాలని స‌జ్జ‌నార్ కోరారు. ఆర్టీసీ యాజమాన్యం సిబ్బందికి 100 శాతం వ్యాక్సిన్ ఇచ్చిందని…కొత్త వేరియంట్ పై బయపడాల్సిన అవసరం లేదని చెప్పారు.

 

మాస్కులు ధరించి సామాజిక దూరాన్ని పాటించాలని….ప్రతి బస్సు శానిటేషన్ చేయడం జరుగుతుందన్నారు. చాలా మంది ఉత్సాహం తో మొదటి డోస్ వ్యాక్సిన్ వేసుకున్నారు..సెకండ్ డోస్ వేసుకోలేదని…..ప్రజలంతా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. బస్ స్టాండ్లలో పరిస్థితి మెరుగు పడిందని…షాపులు అధిక ధరలకు వస్తువులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామ‌ని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే పలు షాపులకు నోటిసులు ఇచ్చామని స‌జ్జనార్ తెలిపారు. ఇక పోలీస్ ఆఫీసర్ గా ఉన్న స‌మ‌యంలోనూ స‌జ్జ‌న్నార్ అనేక సార్లు ర‌క్త ధానం చేసి ఇత‌రుల‌కు ఆద‌ర్శంగా నిలిచారు. కాగా ఆర్టీసీ ఎండీగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర‌వాత మొద‌టిసారి ర‌క్త‌ధానం చేశారు.

Visitors Are Also Reading