తెలంగాణ ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్‌లు బాధ్యతలను చేపట్టిన తరువాత చాలా వరకు ఆర్టీసీ రూపు రేఖలను మార్చేసారు. ముఖ్యంగా ఫంక్షన్లకు పలు ఆఫర్లను ప్రకటించారు. అదేవిధంగా ఆర్టీసీ ప్రయాణం గురించి తెలియజేస్తూ ప్రచారం చేపట్టారు.
Advertisement
ఇదిలా ఉండగా అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు చేయని ప్రయత్నం లేదు. తాజాగా ప్రయాణికుల వీపు మోత మోగించింది తెలంగాణ ఆర్టీసీ. బస్సు ఛార్జీలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. బస్సు ఛార్జీలను పెంచిన 10 రోజుల్లోనే మరొకసారి పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డీజిల్ సెస్ పేరుతో బస్సు ఛార్జీలను పెంచింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డీనరీ సర్వీసులకు రూ.2 పెంచింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, మెట్రో డీలక్స్, సూపర్ లగ్జరీలకు రూ.5 పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Advertisement
బస్సు సర్వీసులలో కనీస ధర రూ.10గా పెంచారు. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలులోకి రానున్నాయి. పల్లె వెలుగు, సిటీ ఆర్టీనరీ బస్సుల్లో కనీస ఛార్జీ 10 గతం నుంచే కొనసాగుతుంది. చమురు ధరలు పెరగడంతో డీజిల్ సెస్ అమలు చేసేందుకు ఆర్టీసీ నిర్ణయం తీసుకుందని.. ఇందుకు ప్రజలు సహకరించాలని ఆర్టీసీ చైర్మన్ బాజీరెడ్డి గోవర్థన్, ఎండీ సజ్జనార్ కోరారు.
Advertisement
Also Read : మహేష్ బాబు కౌంటర్ ఎవరికీ..? జర్నలిస్ట్ కా..? లేక మిగతా హీరోలకా..?