Home » మ‌హేష్ బాబు కౌంట‌ర్ ఎవ‌రికీ..? జ‌ర్న‌లిస్ట్ కా..? లేక మిగ‌తా హీరోల‌కా..?

మ‌హేష్ బాబు కౌంట‌ర్ ఎవ‌రికీ..? జ‌ర్న‌లిస్ట్ కా..? లేక మిగ‌తా హీరోల‌కా..?

by Anji
Ad

టాలీవుడ్ సూప‌ర్ స్టార్ హీరో మ‌హేష్ బాబు చాలా సాప్ట్‌.. ప‌క్క వాళ్ల మ్యాట‌ర్‌లో వేలు పెట్ట‌డు. త‌న జోలికి వ‌స్తే వేలు విరిచేస్తాడు. సైలెంట్గా సాప్ట్‌గా తాను చెప్పాల‌నుకున్న‌ది కూసింత గ‌ట్టిగానే చెబుతాడు.

Advertisement

ప్ర‌స్తుతం డైన‌మిక్ డాషింగ్ డైరెక్ట‌ర్ ప‌ర‌శురాం ద‌ర్శ‌క‌త్వంలో స‌ర్కారు వారి పాట అనే సినిమాలో హీరోగా న‌టిస్తున్న ఈయ‌న‌.. మ‌రికొద్ది రోజుల్లోనే సినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుని స‌మ్మ‌ర్ కానుక‌గా.. మే 12న ఈ చిత్రం విడుద‌ల చేయ‌డానికి సిద్ధమ‌వుతున్నారు.ఈ సినిమా త‌రువాత మాట‌ల మాత్రికుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో మ‌రొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ సినిమాకు క‌మిట్ అయ్యాడు మ‌హేష్ బాబు. ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్దే న‌టిస్తోంది.

Advertisement

ఈ జంట పై అభిమానుల్లో భారీ ఎక్స్ ఫెక్టేష‌న్స్ ఉన్నాయి. అందులోను త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వం అంటే ఇక చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఈ చిత్రానికి సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభిమానులు ఈగ‌ర్‌గా వెయిట్ చేస్తున్నారు.  ఇటీవ‌ల ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఈయ‌న‌కు ఎదురైన ప్రశ్న‌ల‌కు మ‌హేష్ ఇచ్చిన ఆన్స‌ర్స్ కాంట్ర‌వ‌ర్షియ‌ల్‌గా మారాయి. ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న మ‌హేష్ ను ఓ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌శ్నించారు. ఏమ‌న‌గా ప్ర‌స్తుతం అంద‌రూ పాన్ ఇండియా సినిమాల‌ను చేస్తున్నారు క‌దా..? మ‌రీ మీరు కూడా నేరుగా హిందీ సినిమా చేస్తారా..? అలాంటి ఆలోచ‌న‌లు ఉన్నాయా..? అంటూ న‌వ్వుతూనే అడిగాడు ఆ జ‌ర్న‌లిస్ట్‌.

మ‌హేష్ కూడా స్మైల్ ఇస్తూనే.. బాలీవుడ్ జ‌నాల‌ను మెప్పించాలంటే క‌చ్చితంగా హిందీలోనే సినిమా చేయాల్సిన ప‌ని లేదు క‌దా.. ఇప్పుడు ప్ర‌తి తెలుగు సినిమాను ప్ర‌పంచ మంతా చూస్తున్నారు. అలా అనుకుంటే తెలుగు సినిమాలు తీసినా చాలు. అలా కూడా బాలీవుడ్ ప్ర‌జ‌ల‌ను మెప్పించ‌వ‌చ్చ‌ని త‌న‌దైన పంచ్ డైలాగ్‌తో స‌మాధానం చెప్పాడు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. దీనిపై కొంద‌రూ ట్రోల్ చేస్తూ.. ఈ ఆన్స‌ర్ జ‌ర్న‌లిస్ట్‌కు ఇచ్చిన‌ట్టా..? లేక ఆసాకుతో పాన్ ఇండియా సినిమాలంటూ బాలీవుడ్‌లో మ‌కాం వేయాలి అనుకుంటున్న మిగ‌తా హీరోల‌కు ఇచ్చిన‌ట్టా అని తెగ చ‌ర్చించుకుంటున్నారు.

Also Read :  హీరోయిన్ శుభశ్రీ తో అలీ రెండో పెళ్లి…ఫోటో చూసిన వెంట‌నే అలీ మామ ఏం చేశాడంటే..!

Visitors Are Also Reading