Home » కాంతారా సినిమాతో వారంద‌రికీ ప్ర‌తినెల రూ.2వేలు..!

కాంతారా సినిమాతో వారంద‌రికీ ప్ర‌తినెల రూ.2వేలు..!

by Anji
Ad

కన్నడంలో సూప‌ర్ హిట్ సాధించిన సినిమా కాంతారా ప్ర‌స్తుతం యావత్ దేశాన్ని ఊపేస్తోంది. తొల‌త కేవ‌లం కన్నడంలోనే విడుద‌లైన ఈ సినిమా సూప‌ర్ హిట్ కావ‌డంతో ఇతర భాషల్లో కూడా విడుద‌లైంది. మిగ‌తా భాష‌ల‌న్నింటిలో కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. రిషబ్ శెట్టి అద్భుతంగా నటించడమే కాకుండా.. స్వీయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం కలెక్షన్ల పరంగా రికార్డులను సృష్టిస్తోంది.

Also Read : SARDAR MOVIE TWITTER REVIEW : మ‌రో హిట్ కొట్టేసిన కార్తీ

Advertisement

కాంతారా చిత్రం లో ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలను అద్భుతంగా తెరకెక్కించారు. ముఖ్యంగా భూతకాలం నృత్యకారులను చూపించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. కాంతార మూవీ తర్వాత భూతకోలా సంప్రదాయం గురించి దేశమంతా తెలిసింది. ప్రస్తుతం అంతటా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తున్న నేపథ్యంలో.. కర్నాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన భూతకోలా నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్టు తెలిపింది. అర్హులైన వారందరికీ నెలకు రూ.2000 చొప్పున ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇక కాంతార సినిమాల్లో రిషబ్ శెట్టి నటన మరో స్థాయిలో ఉంది. డైరెక్షన్, స్క్రీన్ ప్లే, బీజీఎం కూడా అద్భుతంగా ఉన్నాయని దేశం నలుమూలల ప్రశంసలు అందుతున్నాయి. అందుకే తక్కువ బడ్జెట్ తో నిర్మించినా… కలెక్షన్ లు మాత్రం భారీ బడ్జెట్ చిత్రానికి వచ్చినంతగా వస్తున్నాయి.

Advertisement

Also Read : ఆ యంగ్ హీరోలో సినిమాలో న‌టించ‌నున్న ర‌జినీకాంత్‌..!

కేవలం రూ.15 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన కాంతారా సినిమా ఇప్పటివరకు రూ.150 కోట్లకి పైగా కలెక్షన్లు సాధించినట్లు సమాచారం. తెలుగులో దాదాపు రూ.25 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. తమిళం, మలయాళం, వర్షన్లో నూ మంచి వసూళ్లు సాధిస్తోంది. హిందీ బెల్ట్ లో కూడా కాంతార అదరగొడుతోంది. శుక్రవారం రూ. 1.27 కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీ… శనివారం రూ. 2.75, ఆదివారం 3.50, సోమవారం1.75, మంగళవారం 1.88 కోట్లు, బుధవారం 1.95 కోట్లు సాధించింది. గురువారం కోటికిపైగా వ‌సూలు చేయ‌డం విశేషం. ఇక శుక్ర‌వారం నుంచి వ‌సూళ్లు కాస్త త‌గ్గే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కొత్త సినిమాలు విడుద‌ల కావ‌డం ఇందుకు కార‌ణం.

Also Read : Prince movie review: శివకార్తికేయన్ ప్రిన్స్ సినిమా రివ్యూ….ఆ ఒక్కటి మిస్ అయ్యిందా…?

 

 

Visitors Are Also Reading