దీపావళి పండుగ సందర్భంగా టాలీవుడ్ సందడి ప్రారంభమైంది. ఇవాళ శుక్రవారం కావడంతో తెలుగులో ఒకేసారి నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. మంచు విష్ణు నటించిన జిన్నా, విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా, తమిళ నటుడు శివ కార్తికేయన్ నటించిన ప్రిన్స్, తమిళ నటుడు కార్తీ హీరోగా నటించిన సర్దార్ సినిమా కూడా బాక్సాఫీస్ పోటీలో నిలిచింది. ఇక ఇండియన్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన సర్దార్ సినిమాలో కార్తి విలక్షణ పాత్రలో నటించారు.
Also Read : చిరంజీవితో చెప్పులు కుట్టించిన డైరెక్టర్ ఎవరో తెలుసా..?
అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పీఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం సర్దార్. ప్రిన్స్ పిక్ఛర్స్ బ్యానర్ పై ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మించిన ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌లో రాశిఖన్నా, రజిషా విజయన్ కథానాయికలుగా నటించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఇప్పటికే యూఎస్‌తో పాటు తమిళనాడులో పలు థియేటర్లలో ప్రీమియర్ షోలు పడ్డాయి. సోషల్ మీడియాలో సూర్య, కార్తీ అభిమానులు సర్దార్ హిట్ అంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా సర్దార్ సినిమా ఫస్టాప్ చాలా ఇంట్రెస్ట్‌గా ఉందని.. సినిమా ఇంత బాగుంటుందని అస్సలు అనుకోలేదంటూ ట్వీట్ చేస్తున్నారు.
Also Read : Ginna movie review: జిన్నా మూవీ రివ్యూ& రేటింగ్.. ఎలా ఉందంటే..?
Karthi anna – the diwali winner of all time 😤🔥
Kaithi vs Bigil #Sardar vs prince #SardarDeepavali #SardarDiwali pic.twitter.com/1bTVyNxIZg
— 👹Aravø Sambø👺 (@aravo_sambo) October 21, 2022
ముఖ్యంగా కార్తీ ఎంచుకునే ప్రాజెక్టులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. తమిళంతో పాటు తెలుగులో కూడా ఫాలోయింగ్ బాగానే ఉంది. ఖాకీ, ఖైదీ సినిమాలు సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. తాజాగా విడుదలైన సర్దార్ సినిమాతో కార్తికి హిట్ పడ్డట్టే అని జనాలు మాట్లాడుకుంటున్నారు. సర్దార్ సినిమాలో కార్తి మాస్ ఎంట్రెన్స్ అంటూ కామెంట్స్ చేస్తున్నట్టు నెటిజన్లు. దీపావళికి కార్తీ అన్నా వస్తే అది హిట్ అవుతుందని.. ఖైదీ వర్సెస్ బిగిల్ నడిచింది. ఇప్పుడు ప్రిన్స్ వర్సెస్ సర్దార్ నడుస్తోంది. అప్పుడూ.. ఇప్పుడూ కార్తీనే గెలిచాడంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. మొత్తానికి కార్తీ సర్దార్ సినిమాతో హిట్ కొట్టేసినట్టు కనిపిస్తోంది.
Also Read : కవలలకు జన్మనిచ్చిన తల్లి పై నయన్ క్లారిటీ…! అన్నీ చెప్పేసిందిగా…!