Home » ఆర్ఆర్ఆర్ నుండి రామ్ చరణ్ సాంగ్ వచ్చేసింది…!

ఆర్ఆర్ఆర్ నుండి రామ్ చరణ్ సాంగ్ వచ్చేసింది…!

by AJAY
Ad

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు రాజమౌళి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రానికి డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరియు గోండు బెబ్బులి కొమురం భీం ల ఆధారంగా తెరకెక్కించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కు జోడీగా ఒలివియా మోరిస్ నటించగా రామ్ చరణ్ కు జోడీగా అలియా భట్ నటించింది. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీయ మరియు అజయ్ దేవగన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా 12 భాషల్లో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

Advertisement

ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే తాజాగా సినిమా నుండి రామ్ చరణ్ పాటను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రైజ్ ఆఫ్ రామ్ అనే పేరుతో ఈ పాటను విడుదల చేశారు. రామన్ రాఘవన్ అంటూ సాగిన ఈ పాటను అల్లూరి సీతారామరాజు పోరాట నేపథ్యంలో తీసినట్టు కనిపిస్తోంది. ఈ పాటకు శివదత్త లిరిక్స్ అందించగా విజయ్ ప్రకాష్, హరిహరన్, చందన బాల కళ్యాణ్ కలిసి పాడారు. ఇక ఈ పాటకు కీరవాణి మ్యూజిక్ అందించిన సంగతి తెలిసిందే.

Visitors Are Also Reading