RRR Movie Review Rating: దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్‌చరన్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్, ఫిక్షనల్ అండ్ పీరియాడిక్ చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కరోనా లాక్‌డౌన్, టికెట్ రేట్ల సమస్యలు, వైరస్ బారిన పడడం, గాయాలవ్వడం వాయిదాల పర్వం ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కుని ఎట్టకేలకు అభిమానులను పలుకరించింది. ఎంతో కాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానుల ఉత్కంఠ కు తెరదించుతూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల స్క్రీన్లలో విడుదలైంది. ఈ సినిమా కోసం సినీ ప్రియులు భారీ ఎత్తున తరలివచ్చారు. దీంతో థియేటర్లు ఉదయం నుంచే కళకళలాడుతున్నాయి.
దాదాపు మూడు సంవత్సరాల తరువాత తమ అభిమాన హీరోలు వెండితెరపై కనిపించడం వల్ల అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. జక్కన్న, తారక్, చరణ్ కటౌట్‌లకు అభిషేకాలు చేసి అదిరిపోయిందని సోషల్ మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. హీరోల ఇంట్రడక్షన్, ఫైటింగ్ సీక్వెన్స్, క్లైమాక్స్, విజువల్స్ ఊహకు అందని స్థాయిలో ఉన్నాయని పేర్కొంటున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచి బాహుబలిని మించేలా ఉందని మరికొంత మంది అభిమానులు పేర్కొంటున్నారు.
Advertisement
RRR Movie Review and Rating
ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనలో తమ విశ్వరూపాన్ని చూపించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తారక్ పులిలా గర్జించి విరుచుకుపడగా.. చరణ్ అగ్గి పిడుగులా చెలరేగిపోయాడని వారిద్దరూ చెప్పిన డైలాగ్‌లు ఇద్దరూ కలిసి నటించిన సన్నివేశాలు అదిరిపోయాయని పేర్కొంటున్నారు. పోరాట యోధుడిగా కనిపించిన అజయ్ దేవగణ్, ఆయన భార్య పాత్రలో కనిపించిన శ్రియ పాత్రలు ఎంతో భావోద్వేగాలతో రూపుదిద్దుకుంటున్నాయని కొన్ని సన్నివేశాల్లో వారు చెప్పిన డైలాగ్‌లు పండించిన హావభావాలు ప్రేక్షకుల హృదయాలను ద్రవింపజేసేలా ఉన్నాయని చెబుతున్నారు.
Advertisement
Also Read : RRR Movie : ముక్కుతో రాజమౌళి, ఎన్టీఆర్, చరణ్ లను గీసిన ఆర్టీస్ట్..!
ముఖ్యంగా సముద్రఖని, రాజీవ్‌కనకాల, రాహుల్ రామకృష్ణ, వారి పాత్రలకు న్యాయం చేశారని.. హాలీవుడ్ నటులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాలకు తాకుతున్నాయని చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చూసినంత సేపు ఆర్ఆర్ఆర్ లోకంలో లీనమైపోయినట్టు పేర్కొంటున్నారు. కథ, కథనం, పాత్రలు, పాత్రల మధ్య అనుబంధం, సంఘర్ణన, భావోద్వేగాలు ప్రేక్షకులు ఊహించిన దానికంటే జక్కన్న అద్భుతంగా మలిచారని పేర్కొంటున్నారు. మొత్తానికి ఈ సినిమా రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని పేర్కొంటున్నారు.
ఈ చిత్రంలో చరిత్రకు సంబంధించిన సంఘటనలు ఏమి లేవు. ఈ కథ పూర్తిగా కల్పితం. అల్లూరి సీతారామరాజు, కొమరం భీం కనిపించని సమాజానికి కనిపించని మూడు నాలుగేళ్లలో వాళ్ల మధ్య ఏదైనా బంధం మొదలై ఉంటే ఎలా ఉండేది అనే ఓ కల్పిత ఆలోచనపై ఈ సినిమాను తెరకెక్కించారు. వారిద్దరి స్నేహం, ఇద్దరూ కలిసి బ్రిటిష్ ప్రభుత్వంపై ఎలా పోరాడారన్నదే ఈ సినిమా కథాంశం.
Also Read: Today rasi phalalu in telugu : ఆ రాశి వారు ప్రతిభతో విజయాలు అందుకుంటారు
HONEST REVIEW!
Typical Rajamouli film with a larger than life story. The screen presence of both megastars keep the film going. Not a single dull moment.
Entertaining Masala to watch with family.
4/5🌟 #RRR #RRRMovie #RRRMovieReview #RamCharan #JrNTR #AliaBhatt
— Sanket Shiktode (@TheKnightSanket) March 24, 2022
Block Buster is a small world.#RRRMovie will remain as the best commercial movie ever in Tollywood.@tarak9999 @AlwaysRamCharan Indian avengers laga unaru 🙏🏻🙏🏻🙏🏻@RRRMovie
— Shashi🇨🇦🇮🇳 (@Onlyshashi9999) March 24, 2022