Home » ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఈ సీన్స్ డిలీట్ చేసి తప్పు పని చేసారా ? ఆ హీరోకి అన్యాయమే జరిగిందిగా !

‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఈ సీన్స్ డిలీట్ చేసి తప్పు పని చేసారా ? ఆ హీరోకి అన్యాయమే జరిగిందిగా !

by AJAY
Ad

రాజ‌మౌళి ద‌ర్శ‌కత్వంలో రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ లు హీరోలుగా న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవ‌ల విడుద‌లై రికార్డులు క్రియేట్ చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా వేల కోట్ల క‌లెక్ష‌న్ ల‌ను రాబట్టింది. కేవ‌లం ఇండియాలోనే కాకుండా విదేశాల్లో సైతం ఈ సినిమా స‌త్తా చాటింది. ఇప్ప‌టి వ‌ర‌కూ జక్క‌న్న పాన్ ఇండియా డైరెక్టర్ గా ఉండ‌గా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ వ‌రల్డ్ ద‌ర్శ‌కుడిగా మారిపోయారు.

Advertisement

ఈ సినిమాను ఇంగ్లీష్ లో చూసిన విదేశీలు ట్విట్ట‌ర్ లో జ‌క్క‌న్న మేకింగ్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. ఇక ఈ చిత్రంలో రామ్ చ‌రణ్ అల్లూరి పాత్ర‌లో న‌టించ‌గా ఎన్టీఆర్ కొమురం భీం పాత్ర‌లో న‌టించారు. సినిమాల్లోని చాలా సీన్లు గౌస్ బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ముఖ్యంగా ఎమోష‌న‌ల్ సన్నివేశాలు మ‌రియు యాక్ష‌న్ స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలిచాయి.

Advertisement

ఇదిలా ఉంటే ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాల‌ను చిత్రీక‌ర‌ణ అనంత‌రం ఎడింటింగ్ లో భాగంగా డిలీట్ చేశార‌ట‌. అలా డిలీట్ చేసిన సీన్ల‌లో రామ్ చ‌ర‌ణ్ చిన్న‌నాటి సీన్ కూడా ఒక‌టి ఉంది. అదే కాన్స‌ప్ట్ ఆర్ సీన్….రామ్ చ‌రణ్ బాల‌య్యంలో పండితుల ఆశీర్వ‌చ‌నాలు తీసుకుంటాడు. అప్పుడు రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద అగ్ని ఉంటుంది.

rrr-movie-review

అగ్ని సాక్షిగా చ‌ర‌ణ్ పండిత‌ల ఆశీర్వాదం తీసుకుంటాడు. ఈ సీన్ ను చిత్రీక‌ర‌ణ త‌ర‌వాత ఎడిటింగ్ లో లేపేశారు. అయితే ఇదే సీన్ ను ఆర్ఆర్ఆర్ సినిమాకు కాన్స్పెప్ట్ డిజైన‌ర్ గా ప‌నిచేసిన విశ్వ‌నాథ్ సుంద‌రం సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. దాంతో ఈ సీన్ నెట్టింట వైర‌ల్ గా మారింది. ఇక ఈ సీన్ చూసిన అభిమానులు ఇంత మంచి సీన్ ను ఎందుకు లేపేశారు జ‌క్క‌న్నా అంటూ కామెంట్ లు పెడుతున్నారు. ఇక మ‌రికొంద‌రు ఇలా లేపేసిన సీన్లు ఒక్కొక్క‌టిగా వ‌ద‌లండి అంటూ కోరుతున్నారు.

Visitors Are Also Reading