Home » ఆర్ఆర్ఆర్ కోసం కోట్లల్లో పుచ్చుకున్న నటీనటులు…ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే….!

ఆర్ఆర్ఆర్ కోసం కోట్లల్లో పుచ్చుకున్న నటీనటులు…ఎవరి రెమ్యునరేషన్ ఎంతంటే….!

by AJAY
Published: Last Updated on
Ad

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. ఈ సినిమాను అల్లూరి సీతారామ రాజు, కొమురం భీమ్ ల కథ ఆధారంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడిగా అలియా భట్ హీరోయిన్ గా నటించగా ఎన్టీఆర్ కు జోడిగా ఒలివియా మోరిస్ నటించింది.

rrr-movie-review

Advertisement

Advertisement

ఇక రాజమౌళి సినిమా అంటే కలెక్షన్స్ ఏ రేంజ్ లో వస్తాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమా బడ్జెట్ కూడా అదే రేంజ్ లో ఉంటుంది. అయితే ఇదిలా ఉండగా ఈ భారీ బడ్జెట్ కోసం చిత్రం లో నటించిన నటీనటులు కూడా రెమ్యునరేషన్ భారీగానే పుచ్చుకున్నారు. తాజాగా టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారంగా ఈ సినిమాకు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గన్ రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నారట.

అంతే కాకుండా ఆలియా భట్ ఈ సినిమా కోసం రూ.9 కోట్లు తీసుకున్నారట. ఇక రామ్ చరణ్ ఎన్టీఆర్ లు రూ. 45 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ లు తీసుకున్నారట. సినిమాకు అన్నీ తానే అయిన రాజమౌళి ఈ చిత్రం లాభాల్లో 30 శాతం వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నట్టు టాక్. ఇక ఈ చిత్రం మార్చి 25న విడుదల కానుంది.

Visitors Are Also Reading