Home » ఆర్ఆర్ఆర్ న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ వివరాలు ఇవే…!

ఆర్ఆర్ఆర్ న‌టీన‌టుల రెమ్యున‌రేష‌న్ వివరాలు ఇవే…!

by AJAY
Ad

దర్శక ధీరుడు జక్కన్న తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా నటించారు. ఈ సినిమాను డీవీవీ దాన‌య్య నిర్మించారు. ఈ చిత్నాన్ని మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు మరియు గోండు బెబ్బులి కొమరం భీంల పాత్రల ఆధారంగా తెరకెక్కించారు. సినిమాలో చరణ్ అల్లూరి పాత్రలో ఎన్టీఆర్ కొమురంభీం పాత్రలో నటించారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ మరియు బాలీవుడ్ నటుడు అజయ్ దేవ్ గ‌న్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. ఇక ఇప్పటికే ఈ చిత్రానికి వేల కోట్ల బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే.

RRR ACTORS REMUNARATIONS

RRR ACTORS REMUNARATIONS

అయితే ముందు నుండి ఈ సినిమాకు హీరోలు ఎంత రెమ్యునేష‌న్ పుచ్చుకున్నారా అని చర్చ జరుగుతోంది. కాగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం ఎన్టీఆర్ రూ.45 కోట్లు అదేవిధంగా రామ్ చరణ్ రూ.45 కోట్లు రెమ్యునేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ కు రూ.25 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చార‌ని స‌మాచారం. అదే విధంగా బాలీవుడ్ హీరోయిన్ అలియా భ‌ట్ కు 9 కోట్లు రెమ్యున‌రేష‌న్ ఇచ్చినట్టు సమాచారం. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించిన జ‌క్క‌న్న‌కు ఏకంగా లాభాల్లో 30% వాటా ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్టు సమాచారం.

Advertisement

Advertisement

ALSO READ :  నంద‌మూరి మెగాఫ్యామిలీ మ‌ధ్య 35ఏళ్లుగా వార్…అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన ఎన్టీఆర్..!

అంటే దాదాపు సినిమా బడ్జెట్ లో సగం వరకు రెమ్యున‌రేష‌న్ ల‌కు ఖర్చు అయినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా జ‌న‌వరి 7న విడుద‌ల కానుంది. దాంతో చిత్ర యూనిట్ ప్ర‌మోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉంది. చర‌ణ్, ఎన్టీఆర్ లు సినిమా ప్ర‌మోష‌న్స్ కోసం చెన్నై, బెంగులూరు, ముంబైకి వెళుతున్నారు. అన్ని ఛాన‌ళ్ల టీవీ షోల‌కు వెళుతూ సంద‌డి చేస్తున్నారు. ఇక ఎన్నో అంచ‌నాల మ‌ధ్య వ‌స్తోన్న ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

Visitors Are Also Reading