Telugu News » నంద‌మూరి మెగాఫ్యామిలీ మ‌ధ్య 35ఏళ్లుగా వార్…అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన ఎన్టీఆర్..!

నంద‌మూరి మెగాఫ్యామిలీ మ‌ధ్య 35ఏళ్లుగా వార్…అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టిన ఎన్టీఆర్..!

by AJAY MADDIBOINA

సినిమా ఇండ‌స్ట్రీలో సైలెంట్ వార్ ఎప్పుడూ న‌డుస్తూనే ఉంటుంది. అవునన్నా కాద‌న్నా ప్ర‌తి ఇండ‌స్ట్రీలోనూ ఇది సాధార‌ణంగా క‌నిపిస్తూనే ఉంటుంది. కొన్ని సార్లు వ్య‌క్తిగ‌త దూష‌ణలు కూడా చేసుకుంటూ ఉంటారు. రీసెంట్ గా జ‌రిగిపోయిన మా ఎన్నిక‌ల‌నే అందుకు ఉదాహ‌ర‌ణ‌గా తీసుకోవ‌చ్చు. ఇక అభిమానుల గురించి అయితే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. క‌య్యానికి కాలు దువ్వుతూ మా హీరో గొప్ప మీ హీరో వేస్ట్ అంటూ ఒక‌రినొక‌రు రెచ్చ‌గొడుతూ ఉంటారు. అయితే తాజాగా ఇండస్ట్రీలో కుటుంబాల మ‌ధ్య పోరుపై జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

Ads
charan ntr

charan ntr

ఎన్టీఆర్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి పాన్ ఇండియా చిత్రం ఆర్ఆర్ఆర్ లో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాకు రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమా జ‌న‌వ‌రి 7న విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. ఈ నేప‌థ్యంలోనే చిత్ర యూనిట్ ప్రమోష‌న్స్ లో ఫుల్ బిజీగా ఉంది. అయితే తాజాగా ఓ ఇంట‌ర్యూలో ఆర్ఆర్ఆర్ సినిమా త‌ర‌వాత మ‌ల్టీ స్టారర్ లు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయా అని యాంకర్ ప్ర‌శ్నించగా ఎన్టీఆర్ ను ప్ర‌శ్నించ‌గా ఆయ‌న‌ మాట్లాడుతూ….ఈ విష‌యం ఇప్పుడు మాట్లాడాలో లేదో తెలియదు.

also read : ఈ ఏడుగురు అన్న‌ద‌మ్ములు టాలీవుడ్ లో హీరోలు…!

మా రెండు కుటుంబాల మ‌ధ్య 35 ఏళ్లుగా పోరు న‌డుస్తుంది. అయినా మేం ఇద్ద‌రం రామ్ చ‌ర‌ణ్ ఎన్టీఆర్ మంచి స్నేహితులం. మా మ‌ధ్య‌న పోరు ఎప్పుడూ పాజిటివ్ గానే ఉంటుంది. ఆర్ఆర్ఆర్ త‌ర‌వాత దేశంలోని టాప్ స్టార్స్ అంతా ఒకేతాటిపైకి వ‌స్తార‌ని..భారీ మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు వ‌స్తాయని న‌మ్మ‌కం ఉంది. అంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఇక ఎన్టీఆర్ చేసిన కామెంట్లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.


You may also like