Home » హైదరాబాద్ పై RCB భారీ విజయం..

హైదరాబాద్ పై RCB భారీ విజయం..

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో ఈరోజు సన్ రైజర్స్ హైదరాబాద్ – రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్ల మధ్య ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం చాలా కీలకమైన మ్యాచ్ జరిగింది. అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ తీసుకున్న బెంగళూర్.. జట్టుకు మొదటి బంతికే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ మొదటి బంతికే ఓపెనర్ గా వచ్చిన కోహ్లీ ఔట్ అయ్యాడు. కానీ ఆ తర్వాత వచ్చిన రజత్ పాటిదార్ తో కెప్టెన్ డుప్లెసిస్ మంచి భాగసౌమ్యం నెలకొల్పాడు.

Advertisement

కానీ 48 పరుగుల వద్ద పాటిదార్ ఔట్ కాగా.. తర్వాత వచ్చిన మాక్స్వెల్ 33 పరుగులు చేసి పెవిలియన్ చేరుకున్నాడు. కానీ చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన దినేష్ కార్తీక్ 8 బంతుల్లో 30 పరుగులతో చెలరేగిపోయాడు. అలాగే డుప్లెసిస్ చివరి వరకు నాట్ ఔట్ గా నిలిచి 73 పరుగులు చేయడంతో ఛాలెంజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేశారు. అనంతరం భారీ లక్ష్య చేధనకు వచ్చిన సన్ రైజర్స్ కు మొదటి ఓవర్లోనే ఒక్క పరుగు చేయకుండా ఇద్దరు ఓపెనర్లు వెనుదిరిగారు.

Advertisement

ఆ తర్వాత వచ్చిన రాహుల్ త్రిపాటి(58) అర్దధాతుకం బాదగా… ఐడెన్ మార్క్రామ్(21), పురాన్(19) పరుగులు చేసారు. మిగితావారెవరు కనీసం డబల్ డిజిట్ కూడా చేయకపోవడంతో సన్ రైజర్స్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 125 పరుగులు చేసి ఆల్ ఔట్ అయ్యింది. దాంతో బెంగళూర్ 67 పరుగుల భారీ విజయాన్ని నమోదు చేయగా.. హైదరాబాద్ వరుసగా నాలుగో ఓటమిని చవిసూసింది.

ఇవి కూడా చదవండి :

ప్రపంచ కప్ టీంఇండియా మెంటర్ గా గంభీర్..?

కోహ్లీపై దారుణమైన ట్రోలింగ్…

Visitors Are Also Reading