Home » పెద‌వి విరిచిన ఫ్యామిలీ ఆడియ‌న్స్… పుష్ప నుండి ఆ సీన్ క‌ట్…!

పెద‌వి విరిచిన ఫ్యామిలీ ఆడియ‌న్స్… పుష్ప నుండి ఆ సీన్ క‌ట్…!

by AJAY
Ad

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పుష్ప సినిమా డిసెంబ‌ర్ 17 విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమాకు సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా ర‌ష్మిక మంద‌న బ‌న్నీకి జోడీగా శ్రీవ‌ల్లి పాత్ర‌లో న‌టించింది. ఇక అల్లు అర్జున్ ఈ సినిమాలో లారీ డ్రైవ‌ర్ పాత్ర‌లో పుష్ప‌రాజ్ గా న‌టించాడు. ఈ చిత్రంలో సునీల్, అన‌సూయ‌, ఫ‌హ‌ద్ ఫాజిల్ కూడా కీల‌క పాత్రల్లో న‌టించారు. సినిమా ఫ‌హ‌ద్ పాత్ర పై ఎన్నో ప్రేక్ష‌కులు ఎన్నో ఆశ‌లుపెట్టుకోగా ఫ‌హ‌ద్ ను సుకుమార్ హోల్డ్ లో పెట్టుకుని పార్ట్ 2 లో బ‌య‌ట‌పెట్టాల‌నుకున్నాడు. ఇక ఈ చిత్రానికి మిశ్ర‌మ‌స్పంద‌న వ‌స్తున్న‌ప్ప‌టికీ క‌లెక్ష‌న్ల జోరు మాత్రం క‌నిపిస్తూనే ఉంది.

Advertisement

pushpa

pushpa

ఇదిలా ఉంటే పుష్ప‌లో ఓ రొమాంటిక్ సీన్ పై ప్రేక్ష‌కులు పెద‌వి విరిచారు. ఫ్యామిలీతో సినిమాకు వెళ్లిన ఆడియ‌న్స్ ఈ సీన్ ఏంట్రా బాబూ అని త‌ల‌లు ప‌ట్టుకున్నారు. దాంతో ఆ సీన్ ను సుకుమార్ డిలీట్ చేశారు. ఈ రోజు నుండి సినిమాలో ఆ సీన్ క‌నిపించ‌కుండా చేశారు. ఇంత‌కీ ఆ సీన్ ఏంటంటే శ్రీవ‌ల్లి ఫోన్ లో మాట్లాడుతున్న స‌మ‌యంలో పుష్ప‌రాజ్ ఆమె భుజం పై చేయి వేసి ప్రైవేట్ పార్టును ట‌చ్ చేస్తాడు. ఈ సీన్ చూడ్డానికి ప్రేక్ష‌కులు థియేట‌ర్లలో చాలా ఇబ్బంది ప‌డుతున్నారు.

Advertisement

ఫ‌స్ట్ డే చాలా మంది ఈ సీన్ ప‌ట్ల అభ్యంతరం వ్య‌క్తం చేయ‌డంతో సుకుమార్ వెంటనే ఆ సీన్ ను క‌ట్ చేయించారు. నిజానికి సుకుమార్ త‌న సినిమాలను రియ‌లిస్టిక్ గా తీస్తుంటారు. ఈ నేప‌థ్యంలోనే ఆ సీన్ క‌థ‌కు అనుగుణంగా పెట్టి ఉంటారు. ఎంత రియ‌లిస్టిక్ అయినా స్టార్ హీరో అయినా మ‌రీ ఇలా తీస్తారా అని కామెంట్లు రావ‌డం……ప్రేక్ష‌కుల అభిప్రాయమే ద‌ర్శ‌కుడికి ముఖ్యం కాబ‌ట్టి మొత్తానికి సుకుమార్ ఆ సీన్ క‌ట్ చేశారు. ఇక ఇప్పుడు ఫ్యామిలీతో స‌హా పుష్ప‌ను ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

Visitors Are Also Reading