Home » Roja : ఇండస్ట్రీలో హీరోయిన్ గా రోజా కూతురు ఎంట్రీ….100 కోట్లతో మూవీ ?

Roja : ఇండస్ట్రీలో హీరోయిన్ గా రోజా కూతురు ఎంట్రీ….100 కోట్లతో మూవీ ?

by Bunty
Ad

ఒకప్పటి స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కొన్ని వందల చిత్రాల్లో నటించి ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. ఇక సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది రోజా. పలు షోలు జబర్దస్త్ వంటి కార్యక్రమాల్లో రోజా చురుగ్గా పాల్గొనేది. ఇక మంత్రి పదవి స్వీకరించిన అనంతరం రోజా సినిమాలకు, షోలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు.

Roja's Daughter Anshu Malika Debut Film In KollyWood

Roja’s Daughter Anshu Malika Debut Film In TollyWood

రోజా సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే తమిళ దర్శకుడు సెల్వమనిని ప్రేమించి వివాహం చేసుకుంది. వీరికి ఒక పాప, ఒక బాబు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక రోజా కూతురు పేరు అన్షు మాలిక. ఈ అమ్మాయికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రోజా కూతురికి పుస్తకాలు రాసే అలవాటు కూడా ఉంది. దీని ద్వారా ఆమె సోషల్ మీడియాలో కూడా ఎంతో ఫాలోయింగ్ ను సంపాదించుకుంది. గత కొద్ది రోజుల నుంచి అన్షుకి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Advertisement

Advertisement

అన్షు కూడా సినిమాల్లో హీరోయిన్గా రాణించాలని అనుకుంటుందట. ఈ విషయం తెలిసిన దర్శకులు అందరూ తనకి ఛాన్సులు ఇవ్వడానికి క్యూ కడుతున్నారట. ముఖ్యంగా కోలీవుడ్ దర్శకులు ఎక్కువగా అన్షు తో సినిమాలు తీయాలని ఆసక్తి చూపిస్తున్నారట. అన్షు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తే తప్పకుండా సక్సెస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఇక ప్రస్తుతం అన్షు చదువుపై ఫోకస్ పెడుతోంది. ఇక చదువు పూర్తయ్యాక సినిమాల్లోకి వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading