Home » బ్రో సినిమాను ఆడించుకోలేనోడు.. జగన్‌ ను ఆడిస్తాడట – రోజా ఫైర్‌

బ్రో సినిమాను ఆడించుకోలేనోడు.. జగన్‌ ను ఆడిస్తాడట – రోజా ఫైర్‌

by Bunty
Ad

 

Roja VS Pawan Kalyan : బ్రో సినిమాను 4 షోలు ఆడించుకోలేనోడు అమిత్ షాకు చెప్పి జగన్ ను ఆటాడిస్తాడంట అంటూ జనసేన పార్టీ చీఫ్‌ పవన్ కళ్యాణ్‌ టార్గెట్ గా మంత్రి రోజా విమర్శలు గుప్పించారు. నిన్న విశాఖలో ఏపీ సీఎం జగన్‌ పై జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి.. జగన్‌ ను ఆటడిస్తానని వార్నింగ్‌ ఇచ్చారు పవన్‌ కళ్యాణ్‌. అయితే…పవన్‌ కళ్యాణ్‌ చేసిన ఆ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్‌ ఇచ్చారు.

Advertisement

Advertisement

దత్తపుత్రుడు పవన్ చంద్రబాబు అరవమంటే అరుస్తాడు కరవమంటే కరుస్తాడని… పవన్ కి ఒక జెండా లేదు ఎజెండా లేదని ఫైర్‌ అయ్యారు ఏపీ మంత్రి రోజా. పవన్ తన బ్రో సినిమా నాలుగు ఆటలు ఆడించు కోలేకపోయాడు….అలాంటి పవన్ జగన్ ను ఒక ఆట ఆడిస్తాడంట అంటూ సెటైర్లు పేల్చారు. దేశాన్ని గడగడలాడించిన సోనియాకు జగన్ ను ఆడించడం కుదరలేదు.. అరటిపండు లాంటి పవన్ నువ్వు ఆడిస్తావా ? అని మండిపడ్డారు రోజా.

పవన్ కళ్యాణ్‌ ఆటలో అరటిపండు అంటూ ఆగ్రహించారు. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టు చదవటమే పవన్ పని అని చురకలు అంటించారు. సొంత తల్లిని, పార్టీని తిట్టినా ప్యాకేజీకి కక్కుర్తి పడిన వ్యక్తి పవన్… చంద్రబాబు చాదస్తంతో పిచ్చివాగుడు వాగుతున్నాడని సీరియస్‌ అయ్యారు మంత్రి రోజా. చంద్రబాబు నిజంగా సింహం లాంటివాడు అయితే సింగల్ గా పోటీ చేయాలని సవాల్‌ విసిరారు మంత్రి రోజా.

 

 

Visitors Are Also Reading