ఆంధ్రప్రదేశ్ రోజా టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తన భర్త సెల్వమణి అన్న మాటలను వారు వక్రీకరించి తప్పుగా అర్థం అయ్యేవిధంగా చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. రోజా భర్త ఆర్. కె. సెల్వమణి ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Advertisement
ఇటీవల ఆయన మీడియా ముందు ఓ ప్రకటన విడుదల చేసారు. తమిళ పరిశ్రమకు చెందిన పెద్ద హీరోలు మన రాష్ట్రంలోనే కాకుండా పక్క రాష్ట్రాల్లో కూడా షూటింగ్ చేస్తున్నారని.. అలా చేయడం వల్ల తమిళ సినీ కార్మికులకు నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. కథ డిమాండ్ మేరకు షూటింగ్‌లు ఎక్కడ జరుపుకున్నా.. అభ్యంతరం లేదు అని.. అయితే భద్రతను సాకుగా చూపుతూ పొరుగు రాష్ట్రాల్లో షూటింగ్‌లు జరపడం సరికాదు అని చెప్పారు.
Advertisement
తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. భర్త అన్న మాటలకు రోజా క్షమాపణలు చెప్పాలని టీడీపీ నాయకులు కోరారు. తాజాగా ఈ విషయంపై రోజా స్పందించింది. తన భర్త మాటలను తప్పుగా వక్రీకరిస్తున్నారని వెల్లడించారు. నా భర్త వ్యాఖ్యలను వక్రీకరించి తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన కార్మికులు ఆ రాష్ట్రంలోనే పని చేసే విధంగా ఉంటే అందరికీ ఉపాధి లభిస్తుందని ఆయన ఉద్దేశం. టీడీపీ నాయకులు ప్రజలకు వేరే అర్థం వచ్చేవిధంగా వక్రీకరిస్తున్నారు. ఆ లెక్కన విశాఖలో షూటింగ్స్ చేయమని ప్రభుత్వం జీవోనే ప్రకటించింది. తెలుగు సినిమా నిర్మాతలు అక్కడ షూటింగ్‌లు చేస్తున్నారా..? జగన్ కు ఏపీ అంటే గౌరవం అంటే ఉంది కాబట్టి అక్కడ ఇళ్లు కట్టుకున్నాం. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఏపీలో ఎందుకు ఇల్లు కట్టుకోలేదు. అందరికీ మంచి జరుగుతుందని.. నా భర్త మాటలను టీడీపీ స్వార్థం కోసం వాడుకుంటుందని తెలిపారు.
Also Read :
చిరంజీవిపై మండి పడుతున్న బయ్యర్లు.. మమ్మల్ని చావమంటావా అంటూ ఆయన ఇంటి చుట్టూ ప్రదక్షిణలు..!!
మీరు లవ్ చేసిన వారితో పెళ్లి జరగాలంటే.. ఈ ఆలయాన్ని దర్శించాల్సిందే..!!