Home » హైపర్ ఆదిపై రోజా సెటైర్లు.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా..?

హైపర్ ఆదిపై రోజా సెటైర్లు.. ఇండస్ట్రీలో లేకుండా చేస్తా..?

by Bunty
Ad

గత కొన్ని రోజులుగా ఏపీ ప్రభుత్వం మరియు జనసేన పార్టీ మధ్య వివాదం చెలరేగుతున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై కామెంట్లు చేస్తుండగా… వైసీపీ నేతలు వరుసగా పవన్ కళ్యాణ్ పై ప్రెస్ మీట్ లు పెట్టి విమర్శలు చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ కు అండగా.. ఇటీవల హైపర్ ఆది… వైసిపి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. ముఖ్యంగా ఏపీ మంత్రి రోజాను టార్గెట్ చేశారు హైపర్ ఆది.

Advertisement

అయితే, తాజాగా రోజా, హైపర్ ఆదికి, గెటప్ శ్రీనుకి హైపర్ టెన్షన్ పుట్టించే లెవెల్లో రాజకీయ రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఇండస్ట్రీలో లేకుండా చేస్తానని వార్నింగ్ చేశారు రోజా. మెగా కాంపౌండ్ లో ఆరుగురు హీరోలు ఉన్నారు. వాళ్ళ ప్రాపకం కోసం ఇలా చిన్న చిన్న ఆర్టిస్టులు జబర్దస్త్ కామెడీ చేస్తున్నారు అంటూ రోజా విమర్శించారు. మెగా హీరోల ప్రాపకం కోసం, సినిమాల్లో వేషాల కోసం తనమీద జుగుప్సాకరమైన వ్యాఖ్యాలు చేస్తున్నారంటూ రోజా మండిపడ్డారు.

Advertisement

సినిమా ఫీల్డ్ నుంచి వచ్చిన కోట శ్రీనివాసరావు, శారద, బాబు మోహన్, తాను అందరం ఎన్నికల్లో గెలిచామని, వాళ్లు తప్ప అంటూ పవన్, నాగబాబులపై రోజా సెటైర్లు వేశారు. పొలిటికల్ అజ్ఞానులు, జోకర్లు చేసే విమర్శలను తాను పట్టించుకోనంటూ ఘాటుగా స్పందించారు రోజా. తాను మంత్రిని అయ్యాక పర్యాటక రంగంలో ఏపీ 18వ ప్లేసుకు పడిపోయిందని, అజ్ఞానంతో మాట్లాడుతున్నారంటూ హైపర్ ఆదికి, పవన్ కళ్యాణ్ కి చురకలు అంటించారు రోజా.

READ ALSO : దిల్ రాజు తేజస్విని రెండో పెళ్లి వెనుక ఇంత స్టోరీ నటించింది… వీరి లవ్ స్టోరీ మామూలుగా లేదు!

 

Visitors Are Also Reading