Telugu News » Blog » భారీ మూల్యం తప్పదు….హైపర్ ఆదికి రోజా స్వీట్ వార్నింగ్….!

భారీ మూల్యం తప్పదు….హైపర్ ఆదికి రోజా స్వీట్ వార్నింగ్….!

by AJAY
Ads

ఒకప్పుడు జబర్దస్త్ లో ఎంతో క్లోజ్ గా కనిపించిన రోజా నాగబాబు ప్రస్తుతం రాజకీయ శత్రువులుగా మారిన సంగతి తెలిసిందే. ఇక జబర్దస్త్ కంటెస్టెంట్ అయిన హైపర్ ఆది మొదటి నుండి పవన్ కళ్యాణ్ అభిమాని అని చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేస్తున్నారు. అయితే ఇటీవల జనసేన మీటింగ్ లో హైపర్ ఆది ఏపీ వైసీపీ నేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

ఆ ఘటనపై మంత్రి రోజా స్పందిస్తూ హైపర్ ఆది పై ఫైర్ అయ్యారు. కాగా మరోసారి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా మాట్లాడుతూ…. మా ఆయన తరచూ చెబుతుంటారు… నిన్ను ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా ఎన్ని అన్నా కూడా నీ క్యారెక్టర్ ను వదులుకోకు అని చెప్పారు. ఆ మాట నేను పాటిస్తాను. ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని కోరుకుంటాను.

Advertisement

హైపర్ ఆది నాపై చేసిన కామెంట్స్ గురించి చాలామంది అడుగుతున్నారు. అది వాళ్ళ కర్మ అని వదిలేస్తున్న…. కానీ వాళ్ళు మాట్లాడిన మాటలకు భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లిస్తారు. జబర్దస్త్ వాళ్ళను నేను కుటుంబ సభ్యులుగా భావిస్తాను. వాళ్ళు తిరుపతి వచ్చినప్పుడు నేనే దర్శనం చేయించి మా ఇంటికి తీసుకుని వెళ్లి భోజనం పెట్టి పంపిస్తాను… నా క్యారెక్టర్ అలాంటిది. ఎవరికోసమో నేను నా క్యారెక్టర్ ను మార్చుకోలేను…ఆ ఇకఇకలు పకపకలు వెక్కిలి నవ్వులు చూస్తే అర్థమవుతుంది…. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పగలను. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ పెద్దది కాబట్టి మాతో పెట్టుకుంటే సినిమాలు లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారు. గతంలో ప్రకాష్ రాజ్ ను కూడా ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేసి సినిమాలు లేకుండా చేశారు.

Advertisement

వీళ్ళను కూడా అలానే చేస్తారని భయంతో ఇలా మాట్లాడుతుంటారు. కానీ భయంతో ఎంతకాలం బతకలేరు. నిజంగానే మెగా ఫ్యామిలీకి అంత సపోర్ట్ ఉంటే వాళ్ళు నిలబెట్టిన ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో గెలవాలి కదా…? ఆయన మంచి ఆర్టిస్ట్ మరి ఆయన ఎందుకు గెలవలేదు. వీళ్లు ఆది లాంటి చిన్న చిన్న ఆర్టిస్టులను గుప్పిట్లో పెట్టుకోవచ్చు. కానీ రాష్ట్ర ప్రజలను గుప్పిట్లో పెట్టుకోలేరు. ఆ మెగా బ్రదర్స్ గురించి రాష్ట్ర ప్రజలకు తెలుసు… కాబట్టే ఎంపీ ఎమ్మెల్యేగా ఓడించారు అంటూ రోజా వ్యాఖ్యానించారు.