భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడు చర్చ అనేది జరుగుతూనే ఉంటుంది. గత మూడేళ్ళుగా కోహ్లీ సెంచరీ చేయడం లేదు.. పరుగులు చేయడం లేదు.. ఫామ్ లేదు అంటూ చర్చ అనేది సాగింది. కానీ తాజాగా ముగిసిన ఆసియా కప్ లో కోహ్లీ ఫామ్ లోకి వచ్చాడు. అలాగే మూడేల తర్వాత సెంచరీ కూడా చేసాడు. ఆఫ్ఘనిస్థాన్ పై కోహ్లీ ఈ సెంచరీ చేసిన మ్యాచ్ లో ఓపెనర్ గా వచ్చాడు.
Advertisement
దాంతో కోహ్లీ ఓపెనర్ గా అయితే బాగా రాణిస్తాడు.. ఇక నుండి అతడిని ఓపెనర్ గా ఆడించాలి అనే చర్చ తెర మిధారకు వచ్చింది. చాలా మంది మాజీ ఆటగాళ్లు కూడా కూడా ఇదే విషయం చెప్పారు. అయితే కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్ పై తాజాగా ప్రస్తుతం కెప్టెన్ రోహిత్ శర్మ కామెంట్స్ చేసాడు. జట్టులో ప్రతి ఒక్కరు అన్ని స్థానాల్లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పాడు.
Advertisement
ఇక విరాట్ కోహ్లీ తమము మూడో ఓపెనర్ అని అన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికాతో జరిగే సిరీస్ లలో కోహ్లీ కొన్ని మ్యాచ్ లలో ఓపెనింగ్ చేస్తాడు.. కానీ ప్రపంచ కప్ లో మా ఓపెనర్ కేఎల్ రాహుల్ అని స్పష్టం చేసాడు. ఇక విరాట్ కోహ్లీ ఓపెనర్ గా రావడం అనేది అప్పటి జట్టు పరిస్థితులను బట్టి ఉంటుంది అని రోహిత్ స్పష్టం చేసాడు.
ఇవి కూడా చదవండి :