Home » రోహిత్ కు గాయం.. సెమీస్ ఆడుతాడా.. లేదా..?

రోహిత్ కు గాయం.. సెమీస్ ఆడుతాడా.. లేదా..?

by Azhar
Ad

ఇండియాలో క్రికెట్ ను ప్రేమించే వారే ఎక్కువ ఉంటారు అనేది తెలిసిందే. అయితే వారందరికీ ఈ రోజు ఉదయం లేచిన తర్వాత వెంటనే ఓ షాక్ అనేది తగ్గిలింది. అదే భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ గాయ పడ్డాడు అని. కానీ గత ఏడాది ప్రపంచ కప్ లో సెమీస్ కు చేరని ఇండియా జట్టు… ఈ ఏడాది మాత్రం గ్రూప్ టాపర్ గా సెమీస్ చేరుకుంది.

Advertisement

దాంతో ఈ ప్రపంచ కప్ టైటిల్ ను ఇండియా తప్పకుండ గెలుస్తుంది అని ఫ్యాన్స్ నమ్మకం పెంచుకున్నారు. కానీ ఇటువంటి సమయంలో సెమీ ఫైనల్స్ వంటి ముఖ్యమైన మ్యాచ్ ముందు రోహిత్ గాయపడ్డాడు అని తెలియడంతో చాల మంది నిరాశకు గురయ్యారు. అయితే ఈరోజు ప్రాక్టీస్ సెషన్ లో రోహిత్ మోచేతికి గాయం అనేది అయ్యింది. కానీ కొంత సమయం తర్వాత రోహిత్ మళ్ళీ ప్రాక్టీస్ కు వచ్చాడు.

Advertisement

కానీ ముందుగా ఉన్నత యాక్టివ్ గా రోహిత్ తర్వాత కనిపించలేదు. అందుకే రోహిత్ సెమీస్ లో ఆడుతాడా లేదా అనే అనుమానం ఎక్కువైంది. కానీ ఇండియా సెమీస్ మ్యాచ్ కు ఒక్క రోజు గ్యాప్ అనేది ఉండటంతో.. ఆ చిన్న గాయం నుండి రోహిత్ కోలుకుంటాడు అని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఒకవేళ రోహిత్ మాత్రం సెమీస్ మ్యాచ్ కు దూరం అయితే ఎవరు కెప్టెన్సీ చేస్తారు అనేదే ఎక్కువ ఆందోళనగా మారింది.

ఇవి కూడా చదవండి :

ఐపీఎల్ తర్వాతి టార్గెట్ అదే..!

భారత విజయాల వెనుక రహస్యం ఇదే..!

Visitors Are Also Reading