భారత జట్టులోని ముఖ్యమైన బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ కూడా ఒక్కడు అనే విషయం తెలిసిందే. జట్టుకు మూడు ఫార్మాట్ లలో బుమ్రా లగే ఆడగల సత్తా ఉన్న భువీ.. ప్రస్తుతం కేవలం టీ20 లకు మాత్రమే పరిమితం అవుతున్నాడు. అందుకు కారణం అతని ఫిట్నెస్ అనే చెప్పాలి. అయితే ఇన్ని రోజులు గాయాలతో జట్టుకు దూరంగా ఉన్న భువీ.. ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత నుండి జట్టుకు పూర్తిగా అందుబాటులో ఉంటున్నాడు.
Advertisement
అయితే ఐపీఎల్ బాగా రాణించిన భువీ.. ఆసియా కప్ లోని సూపర్ 4 లో కీలకమైం రెండు మ్యాచ్ లలో.. అలాగే తాజాగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి మ్యాచ్ లో 19వ ఓవర్ లోనే విఫలం అయ్యాడు. అయితే భువీ ఇలా ఫెయిల్ కావడానికి జట్టు కెప్టెన్ రోహిత్ శర్మనే కారణం అని కామెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే బుమ్రా పైన ఉన్న నమ్మకం అనేది భువీ పైన రోహిత్ కు లేదట.
Advertisement
కెప్టెన్ బౌలర్ పైన నమ్మకం ఉంచకపోతే.. ఏ బౌలర్ అయిన విఫలం అవుతున్నాడు అంటున్నారు. ఐపీఎల్ లో బాగా రాణించిన భువీ.. ఆ తర్వాత పంత్ కెప్టెన్సీలో.. పాండ్య కెప్టెన్సీలో… రాహుల్ కెప్టెన్సీలో.. ధావన్ కెప్టెన్సీలో.. రోహిత్ కెప్టెన్సీలో ఆడాడు. అయితే అందరి కెప్టెన్సీలో రాణించిన భువీ.. కేవలం రోహిత్ కెప్టెన్ గా ఉన్న మ్యాచ్ ల్లోనే విఫలం అవుతున్నాడు. ఇదే రోహిత్ కు భువీ పైన రోహిత్ కు నమ్మకం లేదు అని నిరూపిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :