భారత జట్టు ఇప్పుడు వెస్టిండీస్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. మొదట ఇక్కడ జరిగిన వన్డే సిరీస్ ను శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వైట్ వాష్ చేసిన భారత జట్టు ఇప్పుడు విండీస్ జట్టుతో 5 టీ20 ల సిరీస్ లో తలపడుతుంది. ఇక ఇందులో ఇప్పటివరకు జరిగిన రెండు మ్యాచ్ లలో ఒక్కో జట్టు ఒక్కో మ్యాచ్ గెలిచి 1-1 తో సమానంగా ఉన్నాయి. అయితే నిన్న జరిగిన రెండో టీ20 లో టీం ఇండియా ఓడిన తర్వాత చాల విమర్శలు అనేవి వచ్చాయి.
Advertisement
ఎందుకంటే.. ఆ మ్యాచ్ లో ఆఖరి ఓవర్ లో మన 10 రన్స్ ను డిఫెండ్ చేయాల్సిన సమయంలో కెప్టెన్ రోహిత్.. భువనేశ్వర్ కు కాకుండా ఆవేశ ఖాన్ కు బౌలింగ్ ఇచ్చాడు. కానీ ఆవేశ్ ఆ ఒత్తిడిని తట్టుకోలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్ అనంతరం రోహిత్ శర్మ తాను ఆలా ఎందుకు చేసాడో వివరించాడు. ఈ ఫైనల్ ఓవర్ పై చర్చ అనేది జరుగుతుంది అని నాకు ముందే తెలుసు. అయితే భువీ ఇప్పటికే జట్టుకు ఏం చేసాడో మనకు తెలుసు.
Advertisement
అందువల్ల యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి అనే ఉద్దేశ్యంలో ఒక్క టెస్ట్ చేయడానికి ఆవేశ్ కు బౌలింగ్ ఇచ్చాము. అలా చేయడం వల్ల వారికీ కూడా నమ్మకం అనేది వస్తుంది అని రోహిత్ అన్నాడు. అయితే ఈ మాటలతో మరింత చుక్కులో పడ్డాడు. మన ఇంకా సిరీస్ గెలవలేదు. అప్పుడే పరీక్షలు ఏంటి అంటూ రోహిత్ ను ట్రోల్ చేస్తున్నారు. ఇది ఒక్క చెత్త నిర్ణయం అని అంటున్నారు ప్రజలు.
ఇవి కూడా చదవండి :