Home » బేర్ గిల్స్‌ తో విరాట్ కోహ్లీ…?

బేర్ గిల్స్‌ తో విరాట్ కోహ్లీ…?

by Azhar
Ad

ఈ మధ్య కాలంలో బేర్ గిల్స్‌ పేరు మన ఇండియాలో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే డిస్కవరీ ఛానెల్ లో ‘మ్యాన్ వర్సెస్ వైల్డ్’ షో అనేది చేస్తుంటాడు బేర్ గిల్స్‌. కానీ గతంలో ఎప్పుడు ఎక్కువగా ఒంటరిగా ఎదిగా ఆడవిలో చుక్కుకుంటే ఎలా ముందుకు సాగాలి అనే విషయాన్ని చెబుతూ షో అనేది చేసేవాడు. కానీ ఈ మధ్య బేర్ గిల్స్‌ చేస్తున్న ఈ షోకు మన ఇండియాకు సంబంధించిన పెద్ద పెద్ద సెలబ్రెటీలు వెళ్తున్నారు,

Advertisement

ఇప్పటికే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ, రజినీకాంత్, అక్షయ్ కుమార్, రణ్ వీర్ సింగ్ ఇలా చాలా మంది బేర్ గిల్స్‌ షోలో పాల్గొన్నారు. అతనితో కలిసి అడ్వెంచర్ అనేది చేసారు. అయితే ఇప్పుడు అందుతున్న తాజాగా సమాచారం ప్రకారం భారత మాజీ కెప్టెన్.. రన్ మిషిన్ విరాట్ కోహ్లీ కూడా బేర్ గిల్స్‌ తో కలిసి మ్యాన్ వర్సెస్ వైల్డ్ షోలో పాల్గొనబోతున్నాడు అని తెలుస్తుంది. అయితే ఈ కరమైన వార్తలు రావడానికి కారణం బేర్ గిల్స్‌ అనే చెప్పాలి.

Advertisement

తాజాగా బేర్ గిల్స్‌ తన ట్విట్టర్ లో… విరాట్ కోహ్లీతో కలిసి అడ్వెంచర్ అనేది చేస్తే అద్భుతంగా ఉంటుంది. అతని మనస్సు అనేది సింహంలా ఉంటుంది అని పోస్ట్ చేసాడు. ఇక ఈ పోస్ట్ చుసిన తర్వాత అందరూ కూడా విరాట్ బేర్ గిల్స్‌ తో కలిసి అడ్వెంచర్ చేయబోతున్నారు అని కామెంట్స్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ఇప్పుడు విరాట్ కోహ్లీ విశ్రాంతిలో ఉన్న విషయం తెలిసిందే. ఫామ్ కోల్పోయిన తర్వాత రెస్ట్ అనేది కోహ్లీ తీసుకోవడంతో.. ఈ దొరికిన ఖాళీ సమయంలో కోహ్లీ ఈ షోలో పాల్గొన్నాడు అనే వాదన కూడా వస్తుంది.

ఇవి కూడా చదవండి :

ఎవరికీ లేని టాలెంట్ అర్షదీప్‌కు ఉంది.. అదేంటంటే..?

పాకిస్థాన్ చేసిన అదే తప్పు ఇండియా చేస్తుందా…?

Visitors Are Also Reading