Home » చిరంజీవిని దాటేసి… పవన్ ఓ బ్రాండ్ తెచ్చుకున్నారు-రోహిణి

చిరంజీవిని దాటేసి… పవన్ ఓ బ్రాండ్ తెచ్చుకున్నారు-రోహిణి

by Bunty
Published: Last Updated on
Ad

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. పవన్ కళ్యాణ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా పాలిటిక్స్ కోసం సమయం కేటాయిస్తున్నారు. ఓవైపు రాజకీయాల్లో ఉంటూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్నారు. ఈ మధ్యనే హరిశంకర్, సుజిత్ ల సినిమాలు పూజా కార్యక్రమాలతో ప్రారంభించాడు.  హరి శంకర్ తో చేయబోయే సినిమా ‘తేరి’ రీమేక్ అని తెలుస్తుంది. ఇక సుజిత్ దర్శకత్వంలో చేయబోయేది ‘ఓజి’ అనే గ్యాంగ్ స్టర్ డ్రామా కావడం విశేషం. అయితే తాజాగా ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నటి రోహిణి. ఆమె మాట్లాడుతూ, “సుస్వాగతం సినిమా అప్పటికి నాకు, రఘువరన్ కు పెళ్లి అయ్యింది.

READ ALSO : టాలీవుడ్ లో ఏ వ్యక్తి చనిపోయినా కింగ్ నాగార్జున ఎందుకు వెళ్ళడో తెలుసా ?

Advertisement

Advertisement

మా పెళ్లి తర్వాత ఆయన ఫస్ట్ ప్రాజెక్ట్, చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్, ఈ సినిమా ఆల్రెడీ రఘువరన్, తమిళ్ లో లవ్ టుడే పేరుతో చేసేసారు. దీంతో అందరం మంచి హిట్ అవుతుంది అనుకున్నాం. ఎందుకంటే ఎంతో మంచి కథ. ఇక ఆ సినిమా సెట్ కు వెళ్లి వచ్చిన మొదటి రోజు రఘువరన్ వచ్చి, ఆ అబ్బాయిలో ఏదో ఉందమ్మా, అని చెప్పారు. ఫస్ట్ టైం ఆయన నోటి నుంచే పవన్ కళ్యాణ్ గురించి విని షాక్ అయ్యాను. చిరంజీవి నుంచి పెద్ద టాలెంట్ వస్తున్నప్పుడు చాలా ధైర్యం కావాలి. చిరంజీవిని దాటుకొని తనకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోగలరు అన్నది ఎప్పుడు ఒక క్వశ్చన్ మార్కే.

READ ALSO : ఏపీలో రూ. 13 లక్షల కోట్లతో పెట్టుబడులు…6 లక్షల మందికి ఉద్యోగాలు : సీఎం జగన్

అందులో పవన్ సక్సెస్ అయ్యారన్నారు. ఇక ఆ తర్వాత జానీ సమయంలో వచ్చి, తను చాలా క్రేజీ, ఇలా వచ్చేస్తాడు. చెప్పేస్తాడు. ఏదైనా అంటే అన్ని మీకు తెలుసు కదా అనేస్తాడు. నా మీద ఎంత నమ్మకం. కానీ, తనమీద తనకెంత నమ్మకమో కదా అని చెప్పాడు. ఆయన చెప్పిన దగ్గర నుంచి నాకు పవన్ మీద చాలా సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది. ఇక ఒకసారి పవన్ ను కలిసినప్పుడు రఘువరన్ మీ గురించి ఇలా అన్నారు అని చెప్పగానే, ఆయన చాలా సంతోషించారు. నిజమా, నిజంగానే అన్నారా? అని అడిగారు. అవునండి నిజంగానే అన్నారు అని చెప్పాను” అని చెప్పుకొచ్చింది.

READ ALSO : Magadheera: చిరంజీవి మీద కోపం వచ్చి… మగధీరలో చరణ్ తో ఆ సీన్ తీశాను…!

Visitors Are Also Reading