Home » సుజాతను తాను ఎందుకు ప్రేమిస్తున్నాడో చెప్పిన రాకింగ్ రాకేష్…!

సుజాతను తాను ఎందుకు ప్రేమిస్తున్నాడో చెప్పిన రాకింగ్ రాకేష్…!

by Azhar
Ad

బుల్లితెర పైన జబర్దస్త్ కు ఓ ప్రత్యేక స్థానం అనేది అందరికి తెలిసిందే దాదాపుగా 8 ఏళ్లుగా విజయవంతంగా సాగుతున్న ఈ కామెడీ షో ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది. అలాగే చాలా మంది కమెడియన్లను టాలీవుడ్ కు పరిచయం చేసింది. ఇదిలా ఉంటె.. ఈ కార్యక్రమంలో చాలా జంటలు ఉన్న సంగతి తెలిసిందే. కానీ అందులో అన్ని కేవలం షో కోసం మాత్రమే ఉన్న జంటలు అని అందరూ అనుకున్నారు. అయితే జబర్దస్త్ రాకింగ్ రాకేష్ – జొర్దర్ సుజాత జంట కూడా ఒక్కటి. దీనిని కూడా మొదట అందరూ షో కోసం చేసిన జంటగా భావించారు.

Advertisement

కానీ ఆ తర్వాత వారిద్దరూ నిజంగా ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. అంతేకాకుండా వీరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగిపోయింది అని కొంతమంది అన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన రాకేష్… సుజాతకు తనకు మధ్య ఉన్న బంధం గురించి కొన్ని వ్యాఖ్యలు చేసాడు. రాకేష్ మాట్లాడుతూ… సుజాత కేవలం వృత్తి సంబంధమైన విషయాలలో మాత్రమే కాకుండా వ్యక్తిగత జీవితంతో కూడా నాకు సలహాలు ఇస్తూ ఉంటుంది. ఇక ఆమె ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని కోరుకునేవాళ్లలో నిను కూడా ఒక్కడిని.

Advertisement

ఇక వీరి ప్రేమ గురించి మాట్లాడుతూ… సుజాతపై నాకు ఉన్న ప్రేమ అనేది నిజం అని రాకేష్ అన్నాడు. అలాగే ఆమెతో బంధం ఎంత దూరం వెళ్లిన కూడా ముందుకు వెళ్లినా సంతోషమేనని.. ఆమె నేను ఎప్పుడు బాగుండాలని కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నాడు. అయితే వీరి జంటకు తెరపైన మంచి మార్కులే పడ్డాయి. అందుకే రాకేష్ కు వేరే షోల నుండి కూడా పిలుపు వస్తున్నట్లు తెలుస్తుంది. కానీ తనను ఆర్ధికంగా స్థిర పరిచిన జబర్దస్త్ ను వీడటానికి రాకేష్ సిద్ధంగా లేడు అని సమాచారం. ఇదంతా ఇలా ఉంటె మరి తమ ప్రేమ నిజం అని చెప్పిన రాకేష్ సుజాతతో ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడు అనేది చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి :

ఆ విషయంలో రూట్ ఐడియా కాపీ కొట్టిన కోహ్లీ..!

తమ బోర్డుపై షాకింగ్ కామెంట్స్ చేసిన పాకిస్థాన్ యువ బౌలర్…!

Visitors Are Also Reading