Home » రిషబ్ పంత్  పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే..? 

రిషబ్ పంత్  పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే..? 

by Anji
Ad

భారత క్రికెట్ టీమ్ స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. శుక్రవారం ఉదయం ఢిల్లీ నుంచి రూర్కీ వైపు వెళ్తుండగా ఢిల్లీ-డెహ్రాడూన్ నేషనల్ హైవేపై రోడ్డు ప్రమాదం జరిగింది. వెంటనే డెహ్రాడూన్ ఆసుపత్రికి తరిలించి వైద్యం అందిస్తున్నారు. తాజాగా పంత్ హెల్త్ కండీషన్ పై బీసీసీఐ స్పందించింది. ప్రస్తుతం పంత్ క్షేమంగానే ఉన్నాడని, స్పృహలోకి వచ్చాడని పేర్కొంది. పంత్ నుదురు చిట్లిందని.. వీపుపై మంటల కారణంగా కాలిన గాయాలయ్యాయని, కుడి మోకాలి లిగ్మెంట్, డిస్ లొకేట్ అయినట్టు ఎక్స్ రే లో తెలిసినట్టు బీసీసీఐ పేర్కొంది. కుడి మణికట్టు, బొటన వేలిపై కూడా గాయాలయ్యాయి. ప్రస్తుతం పంత్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. ఎలాంటి ప్రాణపాయ స్థితి లేదని వెల్లడించింది బీసీసీఐ. అదేవిధంగా పంత్ ఆరోగ్య పరిస్థితిని మెడికల్ టీమ్ ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తుందని బీసీసీఐ ఓ ప్రకటనలో చెప్పుకొచ్చింది. 

Advertisement

 

మరోవైపు ఇతర టెస్టులు, స్కాన్ జరుగుతున్నాయని, బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. పంత్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా మాట్లాడినట్టు వివరించారు. అతని పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నామని, అతనికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. రిషబ్ పంత్ వైద్య చికిత్సకి ఖర్చు అయ్యే బడ్జెట్ మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి వెల్లడించారు.   

Advertisement

Also Read :  పంత్ కారుకు ప్రమాదం.. విలువైన వస్తువులు, నగలు దొంగిలించిన జనాలు !

ఈ ప్రమాదానికి కారణం ఏంటి ? అతి వేగమే కారణమా.? ఓవర్ స్పీడ్ తో డ్రైవ్ చేయడం వల్లనే కారును కంట్రోల్ చేయలేక డివైడర్ ని ఢీ కొట్టారా ? లేక నిద్రమత్తులో ఈ ప్రమాదం జరిగిందా ? అనే అంశంపై ఆరా తీస్తున్నారు.మరోవైపు ప్రమాదం జరిగిన సమయంలో రిషబ్ పంత్ సీటు బెల్ట్ ధరించాడా లేదా అనే కోణంలో కూడా విచారిస్తున్నతెలిపారు.  మండుతున్న కారు అద్దాలను పగులగొట్టి రిషబ్ పంత్ బయటికి దూకినట్టు తెలపారు. రాత్రి వేళలో ప్రయాణించడంతో కాస్త నిద్ర మత్తు వచ్చిందని.. రెప్పపాటులోనే ప్రమాదం జరిగిందని వెల్లడించారు. వెంటనే పంత్ ని సమీపంలోని సాక్షమ్ ఆసుపత్రికి తరలించారు. పంత్ ఓ ఫైటర్ అని, అతడు పూర్తి కోరుకున్నగా మళ్లీ మైదానంలోకి అడుగుపెడుతాడు అని ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ సెక్రెటరీ వెల్లడించారు. ఢిల్లీ క్రికెట్ అసోసియేసన్ అతినికి అండగా ఉటుందని స్పష్టం చేశాడు. 

Also Read :  కృతి సనన్ తో ప్రేమాయణం….క్లారిటీ ఇచ్చిన ప్రభాస్….!

Visitors Are Also Reading