Home » కృతి సనన్ తో ప్రేమాయణం….క్లారిటీ ఇచ్చిన ప్రభాస్….!

కృతి సనన్ తో ప్రేమాయణం….క్లారిటీ ఇచ్చిన ప్రభాస్….!

by AJAY
Ad

నట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ అన్ స్టాప‌బుల్ టాక్ షో తో స‌త్తా చాటుతున్నారు. బాల‌య్య సినిమాలే కాకుండా అన్ స్టాప‌బుల్ టాక్ షో కు కూడా ఓ రేంజ్ లో క్రేజ్ వ‌చ్చింది. ఇక బాలయ్య హోస్ట్ కావ‌డంతో స్టార్ హీరోలు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఈ షోకు వ‌స్తున్నారు. రీసెంట్ గా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సైతం బాల‌య్య టాక్ షో లో సంద‌డి చేశారు. ప్ర‌భాస్ గోపిచంద్ క‌లిసి బాల‌య్య టాక్ షో కు వ‌చ్చారు.

Advertisement

దీనికి సంబంధించిన ఎపిసోడ్ ఆహాలో విడుద‌ల చేశారు. ఇక ప్ర‌భాస్ కు ఉన్న క్రేజ్ తో ఆహా స‌ర్వ‌ర్ లు సైతం డౌన్ అవుతున్నాయి. మిలియ‌న్ ల కొద్ది వ్యూవ్స్ రావ‌డంతో ఆహా ఆగిపోయింద‌ని టెక్నిక‌ల్ ఆహాను తిరిగి సెట్ చేస్తోంద‌ని ప్ర‌క‌టించారు. ఇక ఈ ఎపిసోడ్ ప్ర‌సారం అవుంతుండ‌టంతో బాల‌య్య ప్ర‌భాస్ చ‌ర్చించిన కొన్ని విష‌యాలు నెట్టింట వైర‌ల్ అవుతున్నాయి.

Advertisement

ఇంట‌ర్వ్యూలో ప్ర‌భాస్ పెళ్లి మ్యాట‌ర్ ను కూడా బాల‌య్య త‌నదైన స్టైల్ లో బ‌య‌ట‌కు లాగే ప్ర‌య‌త్నం చేశాడు. కాగా ప్ర‌భాస్ ఆదిపురుష్ సినిమా హీరోయిన్ కృతిస‌న‌న్ తో ప్రేమ‌లో ప‌డ్డాడ‌ని ఇద్దరూ డేటింగ్ లో ఉన్నారని కూడా వార్త‌లు వ‌చ్చాయి. దాంతో బాల‌య్య అంత మంది అమ్మాయిల‌తో న‌డిపించి సీత‌తో ప్రేమ‌లో ప‌డ్డావా అంటూ ప్ర‌శ్నించాడు. దానికి ప్ర‌భాస్ మేడమ్ ఆల్రెడీ చెప్పేసింది క‌దా.

Balayya

Balayya

అదేం లేదు…అవ‌న్నీ పుకార్లే అంటూ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా బాల‌య్య రామ్ చ‌ర‌ణ్ కు ఫోన్ చేసినప్పుడు ముందు వీర‌సింహారెడ్డి సినిమా చూసి ఆ త‌ర‌వాత వాల్తేరు వీర‌య్య సినిమా చూడాల‌ని చెప్పాడు. వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ కూడా ఆక‌ట్టుకుంది. ఇక బాల‌య్య ప్ర‌భాస్ ల మ‌ధ్య షోలో ఇంకా ఎలాంటి చ‌ర్చ జ‌రిగిందో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే.

Visitors Are Also Reading