Home » India Vs Newzealand Women : ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డును సృష్టించిన రిచా ఘోష్

India Vs Newzealand Women : ఎవ‌రికీ సాధ్యం కాని రికార్డును సృష్టించిన రిచా ఘోష్

by Anji
Ad

మార్చిలో మ‌హిళ‌ల వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ఉండ‌డంతో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ప్ర‌స్తుతం న్యూజిలాండ్ లో ప‌ర్య‌టిస్తోంది. ఇప్ప‌టికే ఓ టీ-20, మూడు వ‌న్డేలు ఆడిన భార‌త జ‌ట్టు బోణి లేకుండా త‌మ పేల‌వ ప్ర‌ద‌ర్శ‌న కొన‌సాగించింది. అయితే ఇవాళ జ‌రిగిన నాలుగో వ‌న్డేతో మిథాలీరాజ్ ఏన బోణి కొడుతుంద‌ని అభిమానులు భావిస్తే మ‌ళ్లీ నిరాశే మిగిలింది. భార‌త్ ఈ మ్యాచ్‌లో 63 ప‌రుగుల తేడాతో ఓడిపోయింది.

Also Read :  “నిన్ను ప్రెగ్నెంట్ చేస్తా” అంటూ నెటిజ‌న్ దారుణం….రిప్లై తో రాడ్ దింపిన సమంత‌..!

Advertisement

నాలుగో వ‌న్డేలో న్యూజిలాండ్ జ‌ట్టుతో త‌ల‌బ‌డిన భార‌త‌జ‌ట్టు ఛేదించే క్ర‌మంలో ఆప‌సోపాలు ప‌డి చివ‌రికీ టార్గెట్ కు దూరంగా నిలిచిపోయింది. భార‌త యువ వికెట్ కీప‌ర్ రిచా ఘోష్ అసాధార‌ణ బ్యాటింగ్ అంద‌రినీ ఆక‌ట్టుకుంది. ఆర‌వ స్థానంలో బ్యాటింగ్‌కు వ‌చ్చిన రిచా ధ‌నాధ‌న్ షాట్ల‌తో అద‌ర‌గొట్టింది. స‌హ‌చ‌ర ప్లేయ‌ర్లు ఒక్కొక్క‌రుగా పెవిలీయ‌న్ కు చేరుతుంటే రిచా మాత్రం బౌండ‌రీల‌తో విరుచుకుప‌డింది ఈ త‌రుణంలో 4 ఫోర్లు, 4 సిక్స‌ర్లు బాది ఆమె 26 బంతుల్లోనే అర్ద సెంచ‌రీ పూర్తి చేసుకుంది. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు త‌రుపున వ‌న్డేల్లో అత్యంత వేగ‌వంత‌మైన హాప్ సెంచ‌రీ సాధించిన ప్లేయ‌ర్‌గా చ‌రిత్ర‌లో నిలిచింది. గ‌తంలో వేదా కృష్ణ‌మూర్తి పేరిట ఉండేది. 32 బంతుల్లో అర్థ సెంచ‌రీ సాధించింది.

Advertisement

అర్థ సెంచ‌రీ చేసిన కొద్ది సేప‌టికే రిచా 52 ప‌రుగుల వ‌ద్ద పెవిలియ‌న్‌కు చేర‌డంతో టీమిండియా క‌థ ముగిసింది. వ‌ర్షం కార‌ణంగా మ్యాచ్‌ను 20 ఓవ‌ర్ల చొప్పున కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసి కివీస్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 191 ప‌రుగులు చేసింది. భార‌త జ‌ట్టు మాత్రం 17.5 ఓవ‌ర్ల‌లోనే 128 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. ముఖ్యంగా ష‌ఫాలి వ‌ర్మ (0), య‌స్తిక భాటియా (0), ఇలా వ‌చ్చి అలా వెళ్లారు. స్మృతి మంధాన కూడా విఫం అయింది. కెప్టెన్ మిథాలీరాజ్ (28 బంతుల్లో 30 2 పోర్లు, సిక్స్‌) రిచా ఘోష్ 29 బంతుల్లో 52 4 పోర్లు 4 సిక్స‌ర్లు కాసేపు పోరాడారు. జ‌ట్టు విజ‌యాన్ని చేర్చ‌డం కోసం వీరు ఐద‌వ వికెట్ కు 77 ప‌రుగులు జోడించారు. కానీ రిచా అవుట్ అవ్వ‌డంతో భార‌త్ ప‌త‌నం ఆరంభ‌మైంది.

Also Read :  హైద‌రాబాద్ ఎల‌క్ట్రిక్ వాహ‌న‌దారుల‌కు శుభ‌వార్త‌..!

Visitors Are Also Reading