Home » హైద‌రాబాద్ ఎల‌క్ట్రిక్ వాహ‌న‌దారుల‌కు శుభ‌వార్త‌..!

హైద‌రాబాద్ ఎల‌క్ట్రిక్ వాహ‌న‌దారుల‌కు శుభ‌వార్త‌..!

by Anji
Ad

ప్ర‌స్తుతం ఎల‌క్ట్రిక‌ల్ వాహ‌నాలు అందులోకి వ‌స్తున్నాయి. పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల కార‌ణంగా వాహ‌నాల త‌యారీ కంపెనీలు ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌ను తీసుకొస్తున్నాయి. ఇప్ప‌టికే ప‌లు కంపెనీలు టూ వీల‌ర్ వాహ‌నాల‌ను అందుబాటులోకి తీసుకొచ్చాయి. చ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల కార‌ణంగా చాలా మంది ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా మెట్రో న‌గ‌రాల ప్ర‌జ‌లు పెట్రోల్‌, డీజ‌ల్‌తో న‌డిచే బైకులు, కార్ల కంటే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల వైపు ఆస‌క్తి చూపుతున్నారు.

Also Read :  పుష్ప‌లో పోలీస్ గా అద‌ర‌గొట్టిన స‌త్రు ఎవ‌రు..? సుకుమార్ కు ఏమ‌వుతాడో తెలుసా..!

Advertisement

Advertisement

 

అయితే ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌కు బ్యాట‌రీ డిస్‌ఛార్జ్ అయిన‌ట్ట‌యితే ప‌రిస్థితి ఏమిటి..? ఆ స‌మ‌యంలో బ్యాట‌రీలు మార్చుకునే స‌దుపాయముంటే బాగుండు అనే సందేహం క‌లుగుతుంది. అలాంటి వారికి శుభ‌వార్త చెప్ప‌బోతుంది తెలంగాణ స్టేట్ రెన్యువ‌బుల్ ఎన‌ర్జీ డెవ‌ల‌ఫ్‌మెట్ కార్పొరేష‌న్. హైద‌రాబాద్ న‌గ‌రంలో బ్యాట‌రీ స్వాపింగ్ సెంట‌ర్ల‌ను ఏర్పాటు చేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

న‌గ‌రంలో మొద‌టి విడుద‌లో భాగంగా 6 బ్యాట‌రీ స్వాపింగ్ స్టేష‌న్లు ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు టీఎస్ఆర్ఈడీసీఓ అధికారులు నిర్ణ‌యించారు. అయితే సెంట‌ర్‌లో ఒక్కొక్క‌టి రూ.40వేల నుంచి రూ.50వేల విలువైన స్వైపింగ్ బ్యాట‌రీల‌ను అందుబాటులో ఉంచ‌నున్నారు. అయితే ఈ బ్యాట‌రీ స్వాపింగ్ సెంట‌ర్‌లో సుల‌భంగా బ్యాట‌రీ మార్చుకోవ‌చ్చు అని చెబుతున్నారు.

Also Read :  ప్ర‌పంచ‌క‌ప్‌పై నాకు, రోహిత్‌కు ఓ స్ప‌ష్ట‌త ఉంది : రాహుల్ ద్ర‌విడ్

Visitors Are Also Reading