Home » ప్రభాస్ హీరోయిన్ ఏంటి ఇలా అయ్యిపోయింది..!

ప్రభాస్ హీరోయిన్ ఏంటి ఇలా అయ్యిపోయింది..!

by Azhar
Ad

తెలుగు సినిమాల్లో ఇప్పటివరకు చాలా మంది హీరోయిన్స్ గా ఉన్నారు. కానీ వారిలో కొంతమంది మొదట్లో సినిమాలను వదిలిపెట్టి వెళ్ళిపోతే మరికొందరు అయితే మంచి హిట్స్ లో ఉండగానే సడెన్ గా సినిమా నుండి దూరమవుతారు. అలాంటి హీరోయిన్స్ గురించి ఇండస్ట్రీలో చర్చ అనేది బాగా జరుగుతుంది. ఇక మరికొంత మంది హీరోయిన్స్ అయితే సినిమా నుండి వెళ్లిన తర్వాత ఎవరు గుర్తుపట్టాని విధంగా చాలా లావుగా తయారవుతారు. అందులో మిర్చి సినిమా హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ కూడా ఉంటుంది.

Advertisement

టాలీవుడ్ లోకి లీడర్ సినిమాతో వచ్చిన రిచాకు మిరపకాయ్ అనే సినిమా మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. రవితేజ హీరోగా వచ్చిన ఈ సినిమా సూపర్ సక్సెస్ కావడంతో రిచాకు మంచిగానే అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత ప్రభాస్ తో మిర్చి సినిమాలో నరించి మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్న రిచా 2013 లో నాగార్జునతో భాయ్ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా సూపర్ డిజాస్టర్ కావడంతో సినిమాలకు దూరమైంది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు చేయని రిచా అమెరికాకు వెళ్ళిపోయింది. అక్కడే తాను ప్రేమించిన జోయీ లంగెళ్లను వివాహం చేసుకుంది.

Advertisement

ఇక సినిమాలను వదిలేసినా రిచా తన ఫ్యాన్స్ కు మాత్రం ఎప్పుడు అప్డేట్స్ అనేవి ఇస్తుంటే ఉంటుంది. ఇక గత ఏడాది ఓ బాబుకు జన్మనిచ్చిన రిచా.. తన కొడుకుతో ఆడుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అయితే ఈ అన్ని ఫోటోలో కూడా రిచా లావుగా అయినట్లు కనిపిస్తుంది. అయితే రిచా ఇలా కావడం మామూలుగానే జరిగిందా.. లేదా తల్లి అయిన తర్వాత మాములుగా ఆడవాళ్లు లావు అయినట్లు అయ్యిందా అనేది మాత్రం తెలియదు. కానీ రిచాను ఇలా చుసిన తర్వాత ఆమె చేసిన సినిమాలోని ఫోటోలను ఇప్పటి ఫోటోలను పక్కపక్కన పెట్టి ట్రెండ్ అనేది చేస్తున్నారు ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి :

పంత్ లా మారిపోయిన ధోని…!

కోహ్లీని టీ20ల్లో నుండి తప్పించాలి అంటున్న జడేజా..!

Visitors Are Also Reading