Home » రాజమౌళి ని కట్టప్ప తో పోల్చిన ఆర్జీవీ….ఏపీ సర్కార్ పై మరో పంచ్…!

రాజమౌళి ని కట్టప్ప తో పోల్చిన ఆర్జీవీ….ఏపీ సర్కార్ పై మరో పంచ్…!

by Ajay

సంచలనాల దర్శకుడు ఆర్జీవీ ఏపీ మంత్రి పేర్ని నాని తో సోమవారం టికెట్ల ధరల అంశం పై చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. చర్చల అనంతరం తాను ఎగ్జిబిటర్ల, డిస్ట్రిబ్యూటర్ల తరపున చర్చలకు హాజరు అవ్వలేదని తెలిపారు. కేవలం సినిమా టికెట్ల ధరలను తగ్గించడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులను వివరించారని చెప్పారు. ధరలు తగ్గిస్తే సినిమా క్వాలిటీ తగ్గిపోయే అవకాశం ఉందని పేర్ని నాని కి వివరించినట్టు తెలిపారు. అయితే ఆర్జీవీ తో చర్చల అనంతరం కూడా ప్రభుత్వం ధరలు పెంచుతున్నట్లు ప్రకటించలేదు.

Cm jagan rgv

Cm jagan rgv

దాంతో వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా ఏపీ ప్రభుత్వం తీరు పై విమర్శలు కురిపిస్తున్నారు. తాజాగా ఏపీ సర్కార్ ను ప్రశ్నిస్తూ వర్మ మరో ట్వీట్ చేశారు. ట్వీట్ లో…. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమా టిక్కెట్ ధరను రూ. 2200/-కి విక్రయించడానికి మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది….కానీ రాజమౌళి సొంత రాష్ట్రం ఆంద్రప్రదేశ్ రూ. 200/- కు టికెట్ ను విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం అస్తిత్వ ప్రశ్నను లేవనెత్తుతుంది “కట్టప్పను ఎవరు చంపారు? ” అంటూ వర్మ ప్రశ్న వేశారు.

Also read : చ‌మ్మ‌క్ంద్ర‌ను జ‌బ‌ర్ద‌స్త్‌కు రాకుండా అడ్డుకున్న‌ది ఎవ‌రో తెలుసా..?


You may also like