Home » ది కేరళ స్టోరీ సినిమా పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్…!!

ది కేరళ స్టోరీ సినిమా పై ఆర్జీవీ షాకింగ్ కామెంట్స్…!!

by AJAY

సంచలనాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే కెరియర్లో ఎన్నో బ్లాక్ బాస్టర్ మూవీలకు దర్శకత్వం వహించిన ఆర్జీవి దర్శకుడుగా ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. అలా ఇండియా వ్యాప్తంగా తనకంటూ ఒక గ్రేట్ క్రేజ్ను ఏర్పరచుకున్న ఈ దర్శకుడు గత కొన్ని సంవత్సరాలుగా దర్శకత్వం వహించిన ఏ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర విజయం సాధించలేదు.

దానితో ప్రస్తుతం ఆర్జీవి దర్శకత్వం వహించిన సినిమాలకు కూడా ప్రేక్షకుల నుండి పెద్దగా రెస్పాన్స్ రావడం లేదు. దానితో ఈ దర్శకుడు ఎక్కువ శాతం సినిమాలకు కూడా దర్శకత్వం వహించడం లేదు. ఇది ఇలా ఉంటే ఆర్జీవి ఎప్పటికప్పుడు అనేక విశాయలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటాడు. అందులో భాగంగా తాజాగా ఓ భారీ బ్లాక్ బస్టర్ మూవీకి తనదైన రీతిలో ఒక అద్భుతమైన రివ్యూ ఇచ్చాడు. తాజాగా ది కేరళ స్టోరీ అనే మూవీ విడుదల అయిన విషయం మనకు తెలిసిందే.

ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకొని ప్రస్తుతం హౌస్ ఫైల్స్ తో థియేటర్లలో రన్ అవుతుంది. తాజాగా ఈ మూవీపై ఆర్జీవి తనదైన శైలిలో రివ్యూ ఇచ్చాడు. బెంగాలీ దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మలయాళ, తమిళ అమ్మాయిలు నటించారు. ఈ హిందీ మూవీని ఓ గుజరాతి నిర్మాత నిర్మించాడు.

 

తాజాగా విడుదల అయిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇది నిజమైన పాన్ ఇండియా మూవీ అంటూ ఆర్జీవీ ఈ మూవీకి తనదైన రీతిలో రివ్యూ ఇచ్చాడు. ఆదా శర్మ, యోగిత బిహాని, సోనియా బలాని కీలక పాత్రలో నటించిన ఈ మూవీకి సుదొప్తోసెన్ దర్శకత్వం వహించగా… విపుల్ అమృత్ లాల్ శర్మ ఈ మూవీని నిర్మించాడు.

Visitors Are Also Reading