తెలంగాణలో రేవంత్ రెడ్డి టీపీసీసీ చీప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఆయన బలమైన క్యాడర్ ఉన్నా కాంగ్రెస్ కార్యకర్తలలో ఉత్సాహాన్ని పంచుతూ తెరాస పార్టీ, బిజెపి పార్టీలా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందుకు పోతున్నారు. కానీ పార్టీ నేతలు మాత్రం పక్కలో బల్లెంలా తయారయ్యారు. అందుకే అంటారు పెద్దలు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని. కానీ రేవంత్ రెడ్డికి ఇంటి పోరు ఎక్కువైపోయింది. మరి రచ్చ గెలుస్తారా.. మరి ఆ ఇద్దరు నేతల పై ఏ విధమైన ప్లాన్ వేశారు.. ఆ నేతలు ఎవరో తెలుసుకుందాం..?
Advertisement
Advertisement
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా గట్టెక్కించాలని రేవంత్ రెడ్డి బలమైన సంకల్పంతో ముందుకు పోతున్నారు. ప్రతి జిల్లాలోని బలమైన నేతలను కాంగ్రెస్ లోకి తీసుకు వచ్చేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఖమ్మం జిల్లాలోని తెరాస పార్టీలో తీవ్ర అసంతృప్తిలో ఉన్న మాజీ మంత్రి తుమ్మల, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిపై రేవంత్ రెడ్డి కన్నేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు తెరాసపై తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు.
వీరికి పార్టీలో కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ పలుమార్లు వారు వాదించారు. పరోక్షంగా పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారు. పార్టీపై అసంతృప్తితో ఉన్న మేం పార్టీలోనే కొనసాగుతానని ప్రకటిస్తున్నారు. అయితే ఖమ్మం జిల్లాలోని బలమైన నేతగా ఉన్న వీరిని ఎలాగైనా కాంగ్రెస్ లోకి తీసుకురావాలని రేవంత్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.