పూరి జగన్నాథ్ దర్శకత్వం లో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఆగస్ట్ 25న విడుదలై ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కించారు. సినిమాను కరణ్ జోహార్, పూరి జగన్నాథ్ తో పాటు ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో విజయ్ బాక్సర్ గా నటించాడు. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ సినిమా లో మైక్ టై సన్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు.
ఇవి కూడా చదవండి: LIGER MOVIE REVIEW:లైగర్ మూవీ రివ్యూ & రేటింగ్.. విజయ్ పంచ్ లో పవర్ ఎలా ఉందంటే..?
Advertisement
సినిమాలో విజయ్ కి తల్లిగా రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించింది. అయితే నేడు విడుదలైన ఈ సినిమాకు సోషల్ మీడియా లో నెగిటివ్ టాక్ మొదలయ్యింది. సినిమా నెగిటివ్ టాక్ రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం…..పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండ కాంబినేషన్ కావడంతో తో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Advertisement
ఇవి కూడా చదవండి: Jr NTR-Kodali Nani : ఈ ఫోటో ఎప్పటిది..? దీని వెనుక ఉన్న కథ గురించి మీకు తెలుసా..?
కానీ సినిమా ఆ అంచనాలను రీచ్ అవ్వలేదని రివ్యూలు వస్తున్నాయి. లైగర్ సినిమా లో ఫస్ట్ హాఫ్ యావరేజ్ గా ఉండగా సెకండ్ హాఫ్ మాత్రం తలనొప్పిగా ఉందని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. అంతే కాకుండా ప్రారంభం అయినప్పుడు ఆస్తక్తి గా ఉన్నప్పటికీ ఆ తరవాత మాత్రం ట్రాక్ తప్పిందని అభిప్రాయపడుతున్నారు.
అన్నిటి కంటే ముఖ్యంగా సినిమాలో వచ్చే పాటలు సంబంధం లేకుండా వచ్చాయని చెబుతున్నారు. అంతే కాకుండా మైక్ టైసన్ పాత్ర సినిమా కే ప్రాణం అనుకున్నారు. కానీ హాలీవుడ్ నటుడి పాత్ర సినిమాలో కామెడీ గా మారిపోయిందని చెబుతున్నారు. ఈ సినిమా కథ రాసుకోవడం లోనే పూరి జగన్నాథ్ ఫెయిల్ అయ్యాడు అంటూ ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. మరి ముందు ముందు ఈ సినిమాకు ఎలాంటి టాక్ వస్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి: Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారు కీలక విషయాల్లో జాగ్రత్త పడాలి