Home » Jr NTR-Kodali Nani : ఈ ఫోటో ఎప్ప‌టిది..? దీని వెనుక ఉన్న క‌థ గురించి మీకు తెలుసా..?

Jr NTR-Kodali Nani : ఈ ఫోటో ఎప్ప‌టిది..? దీని వెనుక ఉన్న క‌థ గురించి మీకు తెలుసా..?

by Anji
Ad

ఆంధ్ర‌ప్ర‌దేశ్ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కి మ‌ధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి అంద‌రికీ తెలిసిందే. ఎన్టీఆర్ తండ్రి హ‌రికృష్ణ అంటే కొడాలి నానికి అమిత‌మైన అభిమానం. తెలుగు దేశం పార్టీ నుంచే కొడాలి నాని రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభించారు. ఇక ఆ స‌మ‌యంలోనే కొడాలి నాని, ఎన్టీఆర్ కి మ‌ధ్య స్నేహం కుదిరింది. టాలీవుడ్‌లో ఎన్టీఆర్‌, కొడాలి, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఫ్రెండ్‌షిప్ గురించి అప్ప‌ట్లో అంద‌రూ చెప్పుకునేవారు. ఇక అప్పుడ‌ప్పుడు ఎన్టీఆర్ సినిమా సెట్‌లో నాని, వంశీ సంద‌డి చేసేవారు. వీరిద్ద‌రూ క‌లిసి ఎన్టీఆర్‌కి సంబంధించిన కొన్ని సినిమాల‌ను నిర్మించారు. వీరి మ‌ధ్య విభేదాలు త‌లెత్తి వీరు విడిపోయారు.

ఇది కూడా చ‌ద‌వండి :  చిరంజీవి గురించి బ‌న్నీ ఇంట్లో ఏమంటాడో చెప్పిన అల్లుఅర‌వింద్‌..!

Advertisement

ఇటీవ‌ల ఎన్టీఆర్‌, కేంద్ర హోంమంత్రి అమిత్ షా స‌మావేశంపై కొడాలి నాని సంచ‌లన వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే. ప్ర‌ధానంగా రాజకీయంగా ఎలాంటి ఉప‌యోగం లేక‌పోతే ప్ర‌ధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక్క నిమిషం కూడా ఎవ‌రినీ క‌ల‌వ‌ర‌ని పేర్కొన్నారు కొడాలి నాని. సోష‌ల్ మీడియాలో ఈ వ్యాఖ్య‌లు తెగ వైర‌ల్ అయ్యాయి. ఇదిలా ఉండ‌గా.. జూనియ‌ర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఎంత స్నేహంగాఉండే వారో ఈ ఫోటో చూస్తే ఎవ‌రికైనా తెలిసిపోతుంది. కొడాలి నాని కాలు మీద కాలు వేసుకుని కూర్చుని ఉంటే.. కొడాలి నాని ఒడిలో కాలు పెట్టి జూనియ‌ర్ ఎన్టీఆర్ కుర్చీలో కూర్చున్నారు. ఇక ఈ ఫోటోను చూస్తుంటే సుబ్బు సినిమా షూటింగ్ గ్యాప్‌లో తీసిన పోటోలా ఉంద‌ని జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. కొడాలి నాని, ఎన్టీఆర్ ఎంత ఫ్రెండ్లీగా ఉండేవారో ఆ ఫోటో చెప్ప‌క‌నే చెబుతోంది. రాజ‌కీయం ఎంత‌టి మిత్రుల మ‌ధ్య‌నైనా దూరం పెరిగే విధంగా చేస్తుంది. ఇలా వీరిద్ద‌రూ మిత్రులు చెరో దారి ముందుకెళ్తున్నారు. ఇటీవ‌లే అమిత్ షా, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల భేటీపై కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌లతో వీరి స్నేహం మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  చిరంజీవి వల్లే నా అప్పులు తీరాయి అంటున్న రాధిక భర్త.. ఇంత సాయం చేశారా..?


ఎన్టీఆర్, కొడాలి నాని ఒక‌రిపై ఒక‌రు ఎప్పుడూ కూడా విమ‌ర్శ‌లు చేసుకోలేదు. ఇక జూనియ‌ర్ ఎన్టీఆర్‌ని రాజ‌కీయంగా రానివ్వ‌కుండా అడ్డుకుంటార‌ని కొడాలి నాని గ‌తంలోనే వ్యాఖ్యానించారు. ఇక వారి పాత స్నేహ‌మో ఏమో తెలియ‌దు కానీ ఎన్టీఆర్‌, నాని ఇప్ప‌టికీ మిత్రులుగానే స్నేహాన్ని కొన‌సాగిస్తున్న‌ట్టు క‌నిపించ‌క‌పోయినా రాజ‌కీయ శ‌త్రుత్వం లేన‌ట్టుగానే వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం గ‌మ‌నార్హం. సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న ఈ అరుదైన ఫోటోలో మ‌రొక వ్య‌క్తి వ‌ల్ల‌భ‌నేని వంశీ. 2019 ఎన్నిక‌ల్లో టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచి వైసీపీకి మ‌ద్ద‌తు తెలుపుతున్న వంశీ కూడా ఆప్త‌మిత్రుడే కావ‌డం విశేషం. ఎన్టీఆర్‌-వినాయ‌క్ కాంబోలో వ‌చ్చిన అదుర్స్ సినిమాకి వ‌ల్ల‌భ‌నేని వంశీ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఎన్టీఆర్ రాజ‌కీయంగా ముందుకు వ‌చ్చి 2024 ఎన్నిక‌ల్లో ముంద‌డుగు వేస్తే ప‌రిణామాలు ఎలా ఉంటాయో తెలియ‌దు కానీ ప్ర‌స్తుతానికి వంవీ, జూనియ‌ర్ ఎన్టీఆర్ మిత్రులుగానే ఉన్నారు. ఇక ఏది ఏమైనా జూనియ‌ర్ ఎన్టీఆర్‌, కొడాలి నాని, వ‌ల్ల‌భ‌నేని వంశీ ఫొటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డం ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారి తీసింది. ఇక అప్ప‌ట్లో వీరి స్నేహ బంధం ఎలా ఉండేదో ఇలా గుర్తు చేసింది అనే చెప్పాలి.

ఇది కూడా చ‌ద‌వండి :  ప్రముఖ విలన్ రఘువరన్ కొడుకు.. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే.. !

Visitors Are Also Reading