Home » అకిరా కెరీర్ పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. నటనపై ఆసక్తి లేదంటూ..!

అకిరా కెరీర్ పై రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు.. నటనపై ఆసక్తి లేదంటూ..!

by Anji
Ad

పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖీరా నందన్ సినిమాలలోకి వస్తే చూడాలని  పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతోమంది ఆశ పడుతున్నారు.  అయితే తాజాగా పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరాతో కలిసి రాఘవేంద్రరావు దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం  వైరల్ గా మారాయి. రాఘవేంద్రరావు అకిరాతో పాటు తన మనవడితో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ వీరిద్దరూ యూఎస్ఏ లో ఫిలిం ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు.

Advertisement

ఇక ఈ విషయం సోషల్ మీడియాలో షేర్ చేసిన కొంత సమయానికే రాఘవేంద్రరావు డిలీట్ చేయడంతో ఇది కాస్త వైరల్ గా మారింది. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ కుమారుడు త్వరలోనే ఇండస్ట్రీలోకి రాబోతున్నారు అంటూ అభిమానులు పెద్ద ఎత్తున సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఫోటోలపై రేణు దేశాయ్ స్పందిస్తూ.. చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తన కుమారుడు అకిరా నందన్ కు ప్రస్తుతం సినిమాలపై ఏమాత్రం ఆసక్తి లేదని  వెల్లడించారు.

Advertisement

భవిష్యత్తులో తన నిర్ణయాలు ఎలా మారుతాయో తనకు తెలియదని ఆమె చెప్పుకొచ్చారు. అయితే ఇలా ఫోటోలపై ఊహాగానాలు మాత్రం ఆపేయాలని ఈమె కోరారు.ఒకవేళ అకిరా సినిమాలలోకి కనుక రావాలి అనుకుంటే తానే ఈ విషయాన్ని స్వయంగా తెలియజేస్తానని ఈమె వెల్లడించారు. ఇలా అఖీరా నందన్ సినిమాలలోకి రాబోతున్నారని అభిమానులు సంతోషపడే లోపు రేణు దేశాయ్ అకీరాకు నటన అంటే ఆసక్తి లేదంటు కామెంట్ చేయడంతో ఒక్కసారిగా అభిమానులు షాక్ అయ్యారు. అభిమాన హీరో వారసుడు ఇండస్ట్రీలోకి వస్తే చూడాలని ఆత్రుతతో పవర్ స్టార్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పాలి.

మరికొన్ని ముఖ్యమైన వార్తలు :

భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ కీలక అప్డేట్.. అభిమానులకు పండుగే..!

పుష్ప 2 మూవీ గురించి ఈ వార్త వింటే.. మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే..!

Visitors Are Also Reading