ఐకాన్ స్టార్ అల్లు అర్జున్-దర్శకుడు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ పుష్ప గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమా సూపర్ హిట్ సాధించడంతో సీక్వెల్ గా పుష్ప 2 మూవీని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. పార్ట్ 2 షూటింగ్ ప్రారంభమై చాలా కాలమే అవుతున్నప్పటికీ.. ఆ మధ్య విడుదలైన గ్లింప్స్ మినహా మూవీ గురించి ఎలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. తరచూ పార్ట్ 2 గురించి ఏదో ఓ వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది.
Advertisement
తాజాగా పుష్ప 3 కూడా రానుందనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పుష్ప 2 మూవీ ఎండింగ్ లో పార్ట్ 3 గురించి రివీల్ చేస్తారని సమాచారం. అల్లు అర్జున్ ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమాలు కమిట్ అయ్యాడు. పుష్ప 3 మూవీ 2025లో ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేజీఎప్ మూవీ తరహాలోనే పుష్ప మూవీని కూడా ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ మూవీ కూడా పార్ట్ 2 తో ముగుస్తుందని తొలుత భావించారు. కేజీఎఫ్ 2 క్లైమాక్స్ లో థర్డ్ పార్ట్ కి లీడ్ ఇవ్వడంతో అందరూ షాక్ అయ్యారు.
Advertisement
పుష్ప 2లో కూడా థర్డ్ పార్ట్ స్టోరీకి సంబంధించిన లీడ్ ఇస్తాడని టాక్ వినిపిస్తోంది. ఇదే నిజమైతే.. పుష్ప మూవీ మరో క్రేజీ ఫ్రాంచైజ్ గా నిలిచే అవకాశముంది. పుష్ప 2 గురించి రెగ్యులర్ గా వస్తున్న వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయి. పార్ట్ 1 తొలుత డివైడ్ టాక్ సొంతం చేసుకున్నప్పటికీ తరువాత మెల్లగా పుంజుకొని హిందీలో కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచి వరల్డ్ వైడ్ గా సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఐకాన్ స్టార్ అభిమానులు వేయికళ్లతో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో మరీ లెక్కల మాస్టర్ సుకుమార్ పుష్ప 2ని ఏ రేంజ్ లో ప్లాన్ చేస్తాడో వేచి చూడాలి.
మరికొన్ని ముఖ్యమైన వార్తలు :
భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ కీలక అప్డేట్.. అభిమానులకు పండుగే..!
Allu Arjun: సినిమాల్లోకి రాకముందు అల్లు అర్జున్ ఆ పని చేసేవాడా? మొదటి సంపాదన ఎంతంటే?