తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. 2023-24 అకాడమిక్ ఇయర్ లో విద్యార్థులకు 77 రోజులు సెలవులు ఇచ్చింది. విద్యా సంవత్సరంలో 365 రోజులకు గాను 227 రోజుల పాటు తరగతులు జరుగుతాయని ప్రకటించింది. ఈ మేరకు 2023-24 అకాడమిక్ ఇయర్ క్యాలెండర్ ను విడుదల చేసింది ఇంటర్ బోర్డు. అయితే, జూన్ ఒకటవ తేదీ నుంచి నూతన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపింది ఇంటర్ బోర్డు.
Advertisement
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డ్ 2023-24 అకడమిక్ ఇయర్ క్యాలెండర్ ను శనివారం నాడు విడుదల చేసింది. వచ్చే నెల అంటే జూన్ 1వ తేదీ నుంచి విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. అదే సమయంలో ఈ విద్యా సంవత్సరంలో 227 రోజుల పాటు తరగతులు జరుగుతాయని, 77 రోజులు విద్యార్థులకు సెలవులు ఉంటాయని తెలిపింది.
Advertisement
ఈ సెలవుల్లో అక్టోబర్ 19 నుంచి 25వ తేదీ వరకు దసరా సెలవులు, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయి. ఇక ఫిబ్రవరి రెండో వారంలో ప్రాక్టికల్స్, మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు ఉంటాయి అని ఇంటర్ బోర్డు పేర్కొన్నది. ఇదిలా ఉంటే, గత నెల మార్చి 15వ తేదీ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 28, 29 తేదీల్లో ముగిసిన విషయం తెలిసిందే.
READ ALSO : టాలీవుడ్ మరో విషాదం..సీనియర్ నటుడు ‘కాస్ట్యూమ్ కృష్ణ’ కన్నుమూత